టీడీపీ ఎంపీలు చేతగాని వాళ్లని భలేగా చెప్పిన టీడీపీ ఎమ్మెల్యే

ఒక పనిలో ఒకడిని చేతగాని వాడు అని చెప్పడానికి నేరుగా ”చేతగాని వాడు” అనాల్సిన పనిలేదు. ”వాడి పొజిషన్‌లో నేనుంటే తడాఖా చూపించేవాడిని” అంటే చాలు. ప్రస్తుతం పనిలో ఉన్నవాడు చేతగాని వాడేనని అర్థం. ఇప్పుడు ఇదే తరహాలోనే టీడీపీ ఎంపీలంతా చేతగానివాళ్లు అని తేల్చేశారు టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల రెడ్డి. గతంలో టీడీపీ ఎంపీగా చేసిన ఈయన … ప్రత్యేకహోదాపై కేంద్రంలో ఎంపీల తీరుపై స్పందించారు. ఏపీ ప్రత్యేక హోదా కోసం ఎంపీలంతా కలిసి పనిచేయాలని […]

Advertisement
Update:2016-08-11 04:24 IST

ఒక పనిలో ఒకడిని చేతగాని వాడు అని చెప్పడానికి నేరుగా ”చేతగాని వాడు” అనాల్సిన పనిలేదు. ”వాడి పొజిషన్‌లో నేనుంటే తడాఖా చూపించేవాడిని” అంటే చాలు. ప్రస్తుతం పనిలో ఉన్నవాడు చేతగాని వాడేనని అర్థం. ఇప్పుడు ఇదే తరహాలోనే టీడీపీ ఎంపీలంతా చేతగానివాళ్లు అని తేల్చేశారు టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల రెడ్డి. గతంలో టీడీపీ ఎంపీగా చేసిన ఈయన … ప్రత్యేకహోదాపై కేంద్రంలో ఎంపీల తీరుపై స్పందించారు. ఏపీ ప్రత్యేక హోదా కోసం ఎంపీలంతా కలిసి పనిచేయాలని సూచించారు.

ఎంపీలు పోరాడుతున్నా స్పందన లేదని చెప్పారు. ఈ పరిస్థితిలో తాను ఎంపీగా ఉంటే దమ్ము చూపించేవాడినని అంటూ అంతలోనే ఆసక్తిరమైన కామెంట్ చేశారు. ఎంపీగా లేకపోవడం బాధగా ఉందన్నారు. ఇక్కడే టీడీపీ ఎంపీలను పరోక్షంగా చేతగాని వాళ్లు అంటూ వేణుగోపాల్ రెడ్డి తేల్చేసినట్టు భావిస్తున్నారు. నేను ఎంపీగా ఉంటే దమ్ము చూపించేవాడిని అంటే ఇప్పుడున్న టీడీపీ ఎంపీలకు దమ్ములేదా?. వాళ్లు దమ్ము చూపలేక పార్లమెంట్‌లో దమ్ము కొట్టి వచ్చేస్తున్నారా?. అయినా వేణుగోపాల్ రెడ్డి చూశారో లేదో. టీడీపీ ఎంపీలు పార్లమెంట్‌ ఎదుట రోజూ పగటివేషాలు బాగానే వేస్తున్నారు. వేషాల శివప్రసాద్‌కు రోజుకో గెటప్‌ వేయించి మీడియా ముందు దమ్ము చూపెడుతున్నారు. త్వరలోనే తమ స్టామినా జనానికి కూడా అర్థమయ్యేలా బీభత్సమైన వేషం వేయబోతున్నారట. దాన్ని చూసైనా టీడీపీ ఎంపీల పోరాటాన్ని గుర్తించండి వేణుగోపాల్ రెడ్డిగారు. అయినా టీడీపీ ఎంపీలు చేతగాని వాళ్లు అని చెప్పిన విధానం మాత్రం భలే ఉందండి.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News