నయీంను పోషించింది చంద్రబాబు మంత్రే!
నయీంని పెంచిపోషించింది చంద్రబాబు ప్రభత్వమేనని నిన్న టీఆర్ ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. 1999-2003 వరకు నగరం చుట్టుపక్కల నయీం నేరాలు, ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. పోలీసులు ఉన్నతాధికారులతో పాటు, అప్పటి సీఎం చంద్రబాబు కేబినెట్‌లోని కొందరు పెద్దలు కూడా నయీంను తమ అవసరాలకు వాడుకున్నారట. నయీంకు ఉన్న రాజకీయ అండదండల కారణంగా ఏ ఉన్నతాధికారి అతనిని నియంత్రించలేకపోయాడు. ఆ సమయంలో ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిని, ముఖ్యంగా […]
Advertisement
నయీంని పెంచిపోషించింది చంద్రబాబు ప్రభత్వమేనని నిన్న టీఆర్ ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. 1999-2003 వరకు నగరం చుట్టుపక్కల నయీం నేరాలు, ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. పోలీసులు ఉన్నతాధికారులతో పాటు, అప్పటి సీఎం చంద్రబాబు కేబినెట్‌లోని కొందరు పెద్దలు కూడా నయీంను తమ అవసరాలకు వాడుకున్నారట. నయీంకు ఉన్న రాజకీయ అండదండల కారణంగా ఏ ఉన్నతాధికారి అతనిని నియంత్రించలేకపోయాడు. ఆ సమయంలో ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిని, ముఖ్యంగా నక్సలైట్లని చంపించడంలో నయీంను వారంతా వాడుకున్నారని ప్రచారం ఉంది. ముఖ్యంగా మాజీ మావోయిస్టులు బెల్లి లలిత, ఈదన్నలను నయీం దారుణంగా చంపడమే ఇందుకు ఉదాహరణగా చెబుతారు. నయీం హతమైన తరువాత ఇవన్నీ నిజమేనని నిరూపించే ఆధారాలు పోలీసులకు లభించాయన్న ప్రచారం జరుగుతోంది.
ఎందుకంటే.. నయీం తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు చంద్రబాబు హయాంలో మంత్రిగా పనిచేసిన ఓ రాజకీయ నాయకుడు కారణమని తాజాగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. తన రాజకీయ ప్రత్యర్థులని, అజ్ఞాతంలో ఉన్న శత్రువులను మట్టుబెట్టేందుకు అప్పుడు మంత్రిగా ఉన్న ఓ టీడీపీ నేత నయీంకు రాజకీయంగా ఫుల్‌సపోర్టు చేశాడని విచారణలో తేలింది. వీరిద్దరూ ఇప్పటికీ మంచి స్నేహితులేనని తెలిసింది. నయీం ఎన్‌కౌంటర్ ముందు వరకూ వీరిద్దరూ పలుమార్లు ఫోన్‌లో మాట్లాడుకున్నారని కాలేడేటా విశ్లేషించిన పోలీసులు తెలిపారు. ఒకరకంగా చెప్పాలంటే.. నయీం అనుచరులు, ఈ మాజీ మంత్రి అనుచరులు ఒకరేనని తెలుసుకున్న పోలీసులు ఆశ్చర్యపోయారు. విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సదరు మాజీమంత్రి పేరుని కేసులో చేరుస్తారా? లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
Advertisement