అతడు నా వెంట్రుకతో సమానం... చంద్రబాబే కారణం

గ్యాంగ్‌స్టర్‌, నరహంతకుడు నయీంను సృష్టించింది చంద్రబాబేనని టీఆర్‌ఎస్ దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఆరోపించారు. మావోయిస్టులను, ప్రజాసంఘాల నాయకులను అంతమొందించేందుకు చంద్రబాబు హయాంలోనే నయీంను తీసుకొచ్చారని చెప్పారు. చంద్రబాబు అండతోనే గ్యాంగ్‌స్టర్ స్తాయికి ఎదిగి విషనాగులాగా నయీం తయారయ్యాడని రామలింగారెడ్డి ఆరోపించారు. తనను 2004లో ఒకసారి, 2008లో ఒకసారి నయీం బెదిరించిన మాట వాస్తమవేనని రామలింగారెడ్డి చెప్పారు. 2008లో తమ గ్రామం చిట్టాపూర్‌కు నయీం, అతని అనుచరులు వచ్చి రామలింగారెడ్డిని చంపివేస్తామని బెదిరించి వెళ్లిపోయారన్నారు. అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు […]

Advertisement
Update:2016-08-10 15:42 IST

గ్యాంగ్‌స్టర్‌, నరహంతకుడు నయీంను సృష్టించింది చంద్రబాబేనని టీఆర్‌ఎస్ దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఆరోపించారు. మావోయిస్టులను, ప్రజాసంఘాల నాయకులను అంతమొందించేందుకు చంద్రబాబు హయాంలోనే నయీంను తీసుకొచ్చారని చెప్పారు. చంద్రబాబు అండతోనే గ్యాంగ్‌స్టర్ స్తాయికి ఎదిగి విషనాగులాగా నయీం తయారయ్యాడని రామలింగారెడ్డి ఆరోపించారు. తనను 2004లో ఒకసారి, 2008లో ఒకసారి నయీం బెదిరించిన మాట వాస్తమవేనని రామలింగారెడ్డి చెప్పారు.

2008లో తమ గ్రామం చిట్టాపూర్‌కు నయీం, అతని అనుచరులు వచ్చి రామలింగారెడ్డిని చంపివేస్తామని బెదిరించి వెళ్లిపోయారన్నారు. అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. నయీం బెదిరింపులు తనకు వెంట్రుకతో సమానమని రామలింగారెడ్డి అన్నారు. తాను 20ఏళ్ల క్రితమే గిరాయిపల్లి ఎన్‌కౌంటర్‌లో చనిపోవాల్సిన వాడినని… ఆ రోజు అదృష్టం బాగుండి బతికానన్నారు. ఇప్పుడు తాను బతికి ఉండడం, ఎమ్మెల్యే పదవి ఇవన్నీ తన జీవితంలో బోనస్‌ లాంటివేనన్నారు. సీఎం సూచన మేరకే తాను ఒక గన్‌మెన్‌ను పెట్టుకున్నానని… సెక్యూరిటీ లేకుండానే జనంలో తిరుగుతానన్నారు. నయీం పీడ వదిలించడంతో పోలీసులపై విశ్వాసం పెరిగిందన్నారు రామలింగారెడ్డి.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News