జాతిపిత దెబ్బకు హడలెత్తిన పచ్చదొరలు

హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు గగ్గోలు పెట్టినా లెక్కచేయకుండా విజయవాడలో దేవాలయాలు, మసీదులు, చర్చిలు కూల్చివేసిన ప్రభుత్వం అంతటితో ఆగలేదు. ఆలయాలనే కూల్చినా తమను  ఏమీ చేయలేకపోయారన్న ధైర్యంతో బాబు ప్రభుత్వం పేట్రేగింది. వైఎస్‌ విగ్రహాన్ని కూల్చేశారు. మరో అడుగుముందుకేసి ఏకంగా దేశానికి స్వేచ్చవాయువులు ప్రసాదించిన మహాత్మగాంధీ విగ్రహాన్నే పెకలించివేశారు. అర్థరాత్రి తీసుకెళ్లి బుడమేరు బురదలో మహాత్ముడిని సమాధి చేసింది పచ్చ ప్రభుత్వం. అయితే ఈసారి కథ అడ్డం తిరిగింది. దేవాలయాలు, వైఎస్ విగ్రహాన్ని కూల్చినప్పటి కంటే గాంధీ […]

Advertisement
Update:2016-08-07 08:14 IST

హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు గగ్గోలు పెట్టినా లెక్కచేయకుండా విజయవాడలో దేవాలయాలు, మసీదులు, చర్చిలు కూల్చివేసిన ప్రభుత్వం అంతటితో ఆగలేదు. ఆలయాలనే కూల్చినా తమను ఏమీ చేయలేకపోయారన్న ధైర్యంతో బాబు ప్రభుత్వం పేట్రేగింది. వైఎస్‌ విగ్రహాన్ని కూల్చేశారు. మరో అడుగుముందుకేసి ఏకంగా దేశానికి స్వేచ్చవాయువులు ప్రసాదించిన మహాత్మగాంధీ విగ్రహాన్నే పెకలించివేశారు.

అర్థరాత్రి తీసుకెళ్లి బుడమేరు బురదలో మహాత్ముడిని సమాధి చేసింది పచ్చ ప్రభుత్వం. అయితే ఈసారి కథ అడ్డం తిరిగింది. దేవాలయాలు, వైఎస్ విగ్రహాన్ని కూల్చినప్పటి కంటే గాంధీ బొమ్మపై చేయి వేయగానే ప్రభుత్వానికి షాక్ కొట్టింది. పచ్చనేతల పైత్యం పరాకాష్టకు చేరిందన్న ఆగ్రహం రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తమైంది. దీంతో కంగుతిన్న పచ్చదండు… రాత్రికి రాత్రి విగ్రహాన్ని కూల్చిన చోటే కొత్త విగ్రహం పెట్టింది. జనంలో పోయిన పరువును నిలబెట్టుకునేందుకు కాంస్య విగ్రహాన్ని తెచ్చి ఉంచారు. పచ్చ ప్రభుత్వంలో పనిచేస్తున్న వారికి ఈ పని కూడా పబ్లిక్‌గా చేసే ధైర్యం లేకపోయింది. అందుకే ఎవరికీ చెప్పకుండా కొందరు వ్యక్తులను పంపించి రాత్రి వేళ విగ్రహాన్ని ప్రతిష్టించారు.

ఉదయం అక్కడికి వెళ్లిన స్థానికులు, ప్రతిపక్ష పార్టీనేతలు విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. బక్కోడు, బోసినోటి ముసలోడు, అందులోనూ చనిపోయిన వాడు ఏం చేస్తాడులే అనుకుంటే ఇలాగే ఉంటుంది. నూలుపోగుతో బ్రిటీష్ మధపుటేనుగులే బంధించిన జాతిపిత గాంధీ మరణించి ఉండవచ్చు… కానీ ఆయన స్పూర్తి ఇంకా దేశంలో బతికే ఉంది. ఆ విషయం పచ్చ పార్టీకి ఇప్పటికైనా అర్థమైతే మంచిదే!. లేకుంటే తెల్లదొరలను తరిమినట్టు పచ్చదొరలను తరిమే రోజులొస్తాయి.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News