కొట్టుకున్న టీఆర్ ఎస్ కార్యకర్తలు.. ఒకరి పరిస్థితి విషమం!
ఆధిపత్యపోరుతో టీఆర్ ఎస్ కార్యకర్తలు పరస్పరం దాడి చేసుకోవడం ఒకరి ప్రాణాల మీదకు తెచ్చింది. నల్లగొండ జిల్లా చందంపేట మండలం కంబాలపల్లిలో చోటుచేసుకుంది ఈ ఘటన. వివరాలు.. కంబాలపల్లికి చెందిన కొందరు నాయకులు టీడీపీ- కాంగ్రెస్‌లో ఉండేవారు. ఇటీవల వారంతా టీఆర్ ఎస్‌లో చేరారు. పార్టీలో చేరకముందు నుంచే వారి మధ్య విభేదాలు ఉన్నాయి. ఒకేపార్టీలో చేరాక అవి మరింత ముదిరాయి. ఆధిపత్యం కోసం ఇరువర్గాలు తరచుగా ప్రయత్నాలు సాగిస్తుండేవి. ఇవి పరస్పరం దాడులు చేసుకునే వరకు […]
Advertisement
ఆధిపత్యపోరుతో టీఆర్ ఎస్ కార్యకర్తలు పరస్పరం దాడి చేసుకోవడం ఒకరి ప్రాణాల మీదకు తెచ్చింది. నల్లగొండ జిల్లా చందంపేట మండలం కంబాలపల్లిలో చోటుచేసుకుంది ఈ ఘటన. వివరాలు.. కంబాలపల్లికి చెందిన కొందరు నాయకులు టీడీపీ- కాంగ్రెస్‌లో ఉండేవారు. ఇటీవల వారంతా టీఆర్ ఎస్‌లో చేరారు. పార్టీలో చేరకముందు నుంచే వారి మధ్య విభేదాలు ఉన్నాయి. ఒకేపార్టీలో చేరాక అవి మరింత ముదిరాయి. ఆధిపత్యం కోసం ఇరువర్గాలు తరచుగా ప్రయత్నాలు సాగిస్తుండేవి. ఇవి పరస్పరం దాడులు చేసుకునే వరకు వెళ్లింది. గురువారం రాత్రి ఈ రెండు వర్గాల మధ్య ఓ విషయంలో గొడవ చెలరేగింది. ఇది కాస్త తీవ్ర రూపం దాల్చింది. దీంతో రెండు వర్గాల కార్యకర్తలు కర్రలు, రాళ్లు పట్టుకుని కొట్టుకున్నారు. ఈ ఘటనలో రంగయ్య, వెంకటయ్య, కృష్ణయ్యతోపాటు పలువురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో రంగయ్య కు తీవ్ర గాయాలుకావడంతో అతని ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో వైద్యుల సూచనల మేరకు రంగయ్యను హైదరాబాద్‌కు మెరుగైన చికిత్స కోసం పంపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు పరారీలో ఉన్నారు. వారికోసం పోలీసులు గాలిస్తున్నారు.
Advertisement