మహిళలపై అఘాయిత్యాలకు ఒడిగట్టిన వారిలో దేవినేని, అచ్చెన్న

దేశంలోని అన్ని రాష్ట్రాల మంత్రుల ఆస్తులు, వారి నేరాల చిట్టాను ఢిల్లీకి చెందిన అసోసియేషన్ ఆఫ్ డెమెక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ బయటపెట్టింది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ మంత్రులు అగ్రస్థానంలో నిలిచి ఇరగదీశారు. దేశంలోనే అత్యంత ధనికుడైనా మంత్రిగా నారాయణ నిలిచారు. ఆయన ఆస్తుల విలువ ఏకంగా రూ. 496కోట్లు (ఇది ప్రభుత్వ రికార్డుల ప్రకారం విలువ. నిజానికి ఆయన ఆస్తుల మార్కెట్ విలువ ఎంతో ఎక్కువుంటుంది.). ఆయన తర్వాత ఎవరూ దరిదాపుల్లో కూడా లేరు. ఇదే నివేదిక […]

Advertisement
Update:2016-08-06 08:22 IST

దేశంలోని అన్ని రాష్ట్రాల మంత్రుల ఆస్తులు, వారి నేరాల చిట్టాను ఢిల్లీకి చెందిన అసోసియేషన్ ఆఫ్ డెమెక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ బయటపెట్టింది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ మంత్రులు అగ్రస్థానంలో నిలిచి ఇరగదీశారు. దేశంలోనే అత్యంత ధనికుడైనా మంత్రిగా నారాయణ నిలిచారు. ఆయన ఆస్తుల విలువ ఏకంగా రూ. 496కోట్లు (ఇది ప్రభుత్వ రికార్డుల ప్రకారం విలువ. నిజానికి ఆయన ఆస్తుల మార్కెట్ విలువ ఎంతో ఎక్కువుంటుంది.). ఆయన తర్వాత ఎవరూ దరిదాపుల్లో కూడా లేరు. ఇదే నివేదిక మరో విషయాన్ని కూడా బయటపెట్టింది. అన్ని రాష్ట్రాల మంత్రుల నేర చిట్టాను ప్రకటించింది. 210 మందిపై క్రిమినల్ కేసులున్నాయి.

మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారు దేశం మొత్తం మీద నలుగురు మంత్రులు ఉన్నారు. వారిలో ఏపీకి చెందిన మంత్రులు దేవినేని ఉమ, అచ్చెన్నాయుడు పేర్లు ఉన్న విషయాన్ని వైసీపీ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి వెల్లడించారు. దేశం మొత్తం మీద నలుగురు మంత్రులు స్త్రీలపై అఘాయిత్వాలకు పాల్పడితే వారిలో ఇద్దరు మన రాష్ట్రానికి చెందిన వారు కావడం, అది కూడా సీఎంకు సన్నిహితులైన దేవినేని ఉమా, అచ్చెన్నాయుడు కావడం సిగ్గు చేటన్నారు. ఇలాంటి వారిని కేబినెట్‌లో పెట్టుకున్నందుకు చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. కొద్ది రోజుల క్రితమే గుంటూరులో ఒక మంత్రి కుమారుడు అందరూ చూస్తుండగానే అమ్మాయిల హాస్టల్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేకపోవడాన్ని ఏమనాలని భూమన ప్రశ్నించారు. ఇలాంటి మంత్రులను కేబినెట్‌లో పెట్టుకుని మహిళల జీవితాల్లో వెలుగునింపుతామని చంద్రబాబు చెబితే నమ్మాలా అని ప్రశ్నించారు.

క్విట్ ఇండియా ఉద్యమానికి మరికొద్ది రోజుల్లో 75ఏళ్లు పూర్తవుతాయని ఈ సమయంలోనే విజయవాడలోని గాంధీ విగ్రహాన్ని తీసుకెళ్లి బుడమేరులో వేయించిన చంద్రబాబును ఏమనాలన్నారు. ఎన్టీఆర్ చెప్పినట్టు చంద్రబాబును గాడ్సే బాబు అని పిలవాల్సి ఉంటుందన్నారు. ప్రత్యేకహోదాపై జైట్లీ ప్రకటనతో రక్తం మరిగిందన్న చంద్రబాబు… ఆ మరిగిన రక్తాన్ని మురగబెట్టుకుని వెళ్లి అదే జైట్లీకి శాలువా కప్పి వచ్చారని భూమన కరుణాకర్‌ రెడ్డి ఎద్దేవా చేశారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News