ఆ విషయంలో కేసీఆర్ గొప్పదనమేమీ లేదు: మోత్కుపల్లి
కేసీఆర్ ను ఆగర్భ శత్రువుగా పరిగణించే మోత్కుపల్లి నరసింహులు మరోసారి ఆయనపై తన ద్వేషాన్ని చాటుకున్నారు. ఇటీవల యాదాద్రిని జిల్లాగా ప్రకటించింది ప్రభుత్వం. తొలిజాబితాలో యాదాద్రి జిల్లా డిమాండ్‌ను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో స్థానికులు ఆందోళనలకు దిగారు. యాదాద్రిని జిల్లాగా ప్రకటించేందుకు చేపట్టిన ఆందోళనకు టీడీపీ నేత మోత్కుపల్లి నరసింహులు కూడా మద్దతు పలికారు. పలుమార్లు ఆందోళనలో కూడా పాల్గొన్నారు. అనంతరం అధికారులు ఇచ్చిన నివేదికల ఆధారంగా తాజాగా ప్రకటించిన కొత్త జిల్లాల జాబితాలో యాదాద్రికి […]
Advertisement
కేసీఆర్ ను ఆగర్భ శత్రువుగా పరిగణించే మోత్కుపల్లి నరసింహులు మరోసారి ఆయనపై తన ద్వేషాన్ని చాటుకున్నారు. ఇటీవల యాదాద్రిని జిల్లాగా ప్రకటించింది ప్రభుత్వం. తొలిజాబితాలో యాదాద్రి జిల్లా డిమాండ్‌ను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో స్థానికులు ఆందోళనలకు దిగారు. యాదాద్రిని జిల్లాగా ప్రకటించేందుకు చేపట్టిన ఆందోళనకు టీడీపీ నేత మోత్కుపల్లి నరసింహులు కూడా మద్దతు పలికారు. పలుమార్లు ఆందోళనలో కూడా పాల్గొన్నారు. అనంతరం అధికారులు ఇచ్చిన నివేదికల ఆధారంగా తాజాగా ప్రకటించిన కొత్త జిల్లాల జాబితాలో యాదాద్రికి చోటు కల్పించింది ప్రభుత్వం. దీంతో యాదాద్రి పరిసర ప్రాంతాల ప్రజలు, పార్టీల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కానీ, మోత్కుపల్లి మాత్రం తీరు మార్చుకోలేదు.
ఈ విషయంపై ఆయన బుధవారం ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో మాట్లాడారు. యాదాద్రిని జిల్లాగా ప్రకటించడంపై స్పందించారు. యాదాద్రిని జిల్లాగా ప్రకటించడంలో తెలంగాణ సీఎం కేసీఆర్ గొప్పతనమేమీ లేదని తన అక్కసును మరోసారి వెళ్లగక్కారు. యాదాద్రి నృసింహుడే ఆయన మనసు మార్చి యాదాద్రిని జిల్లాగా ప్రకటించేలా చేశాడు తప్ప దీంట్లో కేసీఆర్ మంచితనమేమీ లేదని మరోసారి తన ఆక్రోశాన్ని ప్రదర్శించారు. మోత్కుపల్లిపై గులాబీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ని సీఎం చేసినప్పటి నుంచి మోత్కపల్లి ఇలాగే పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నాడని విమర్శించారు. ఎన్నికల్లో జనం చీకొట్టినా ఇంకా తీరు మారకపోవడం బాధాకరమన్నారు. ఈ వ్యాఖ్యలు దిగజారిన ఆయన మనస్తత్వానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. యాదాద్రిని జిల్లా చేస్తే.. కృతజ్ఞతలు తెలపాల్సిందిపోయి విమర్శిస్తున్నారంటే.. ఆయన మతిస్థిమితం పై తమకు అనుమానాలు వస్తున్నాయన్నారు.
Advertisement