తనంటే గిట్టనివారే దుష్ప్రచారం చేస్తున్నారు?
తాను పార్టీ మారుతున్నానంటూ వస్తోన్న ఆరోపణలపై తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు ఎల్.రమణ స్పందించారు. ఇదంతా కేవలం దుష్ప్రచారమేనని కొట్టిపారేశారు. తానంటే గిట్టనివారే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తాను రాజకీయ సన్యాసం చేస్తున్నానని, త్వరలోనే క్రియాశీలక రాజకీయాలకు దూరమవుతున్నానంటూ వచ్చిన వార్తలను ఖండించారు. తెలుగుదేశానికి అనుకూలంగా వ్యవహరించే పత్రికలో రమణకు వ్యతిరేకంగా వార్తలు రావడం ఆయన వర్గాల్లో కలవరానికి దారితీసింది. ఓ వైపు రేవంత్ రెడ్డి లేకపోతే.. తెలంగాణలో తెలుగుదేశం మనుగడ కష్టమని, ఆయన అప్పటికప్పుడు తీసుకుంటున్న […]
Advertisement
తాను పార్టీ మారుతున్నానంటూ వస్తోన్న ఆరోపణలపై తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు ఎల్.రమణ స్పందించారు. ఇదంతా కేవలం దుష్ప్రచారమేనని కొట్టిపారేశారు. తానంటే గిట్టనివారే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తాను రాజకీయ సన్యాసం చేస్తున్నానని, త్వరలోనే క్రియాశీలక రాజకీయాలకు దూరమవుతున్నానంటూ వచ్చిన వార్తలను ఖండించారు. తెలుగుదేశానికి అనుకూలంగా వ్యవహరించే పత్రికలో రమణకు వ్యతిరేకంగా వార్తలు రావడం ఆయన వర్గాల్లో కలవరానికి దారితీసింది. ఓ వైపు రేవంత్ రెడ్డి లేకపోతే.. తెలంగాణలో తెలుగుదేశం మనుగడ కష్టమని, ఆయన అప్పటికప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలే పార్టీని కాపాడుతున్నాయంటూ రమణ ఆధిపత్యాన్ని ప్రశ్నించేలా కథనాలు వెలువడుతున్నా.. ఆయన వాటిపై స్పందించలేదు. ఈ విషయాన్ని ఇప్పటికే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా రేవంత్ పై ఎలాంటి చర్య తీసుకోకపోవడంపై రమణ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
కానీ, ఇప్పుడు రమణ తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరబోతున్నారంటూ మరో కొత్త ప్రచారం మొదలైంది. పార్టీలో జరుగుతున్న అంతర్గత కలహాలపై కినుక వహిస్తూ వస్తోన్న రమణ దీనిపై మాత్రం సీరియస్‌గానే స్పందించారు. తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న పత్రికలోనే రమణపై వ్యతిరేక కథనాలు రావడం రేవంత్ రెడ్డి అనుకూల వర్గం చేస్తోన్న కుట్రగానే రమణ అనుచరులు భావిస్తున్నారు. పథకం ప్రకారం,. రమణ రాజకీయ సన్యాసం ఒకరోజు.. రమణ పార్టీ మారుతున్నాడని మరోరోజు పనిగట్టుకుని వార్తలు రాయిస్తూ మానసికంగా దెబ్బతీయాలన్న కుట్రలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా.. అధిష్టానం రమణకు మద్దతుగా నిలవకపోవడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Advertisement