12 ఏళ్ల బాలుడి సజీవ దహనం...అక్కే చంపేసిందా?!
తల్లీ కూతుళ్లపై దోపిడీ దొంగల సామూహిక అత్యాచారం ఘటనతో వార్తల్లోకి ఎక్కిన ఉత్తర ప్రదేశ్ లోని బులంద్‌షార్‌లో మరో దారుణం జరిగింది. 12 ఏళ్ల బాలుడిని కాళ్లు చేతులు కట్టేసి కిరోసిన్ పోసి తగుల బెట్టారు. ఈ కేసులో పోలీసులు బాలుడి సోదరిని అనుమానిస్తున్నారు. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం బాలుడి తల్లిదండ్రులు రాకేష్ సింగ్ ట్యాక్సీ డ్రైవర్ కాగా తల్లి మంజు దినసరి వేతనం మీద పనిచేస్తుంటుంది. మంగళవారం ఉదయం వారిద్దరూ తమ పనుల మీద […]
తల్లీ కూతుళ్లపై దోపిడీ దొంగల సామూహిక అత్యాచారం ఘటనతో వార్తల్లోకి ఎక్కిన ఉత్తర ప్రదేశ్ లోని బులంద్‌షార్‌లో మరో దారుణం జరిగింది. 12 ఏళ్ల బాలుడిని కాళ్లు చేతులు కట్టేసి కిరోసిన్ పోసి తగుల బెట్టారు. ఈ కేసులో పోలీసులు బాలుడి సోదరిని అనుమానిస్తున్నారు. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం బాలుడి తల్లిదండ్రులు రాకేష్ సింగ్ ట్యాక్సీ డ్రైవర్ కాగా తల్లి మంజు దినసరి వేతనం మీద పనిచేస్తుంటుంది. మంగళవారం ఉదయం వారిద్దరూ తమ పనుల మీద బయటకు వెళ్లిపోయారు. మధ్యాహ్నం మూడుగంటలకు మంజుకి కుమార్తె నుండి ఫోన్ వచ్చింది. తమ్ముడు చనిపోయాడని ఆమె చెప్పింది. మంజు ఇంటికి వచ్చేసరికి మూడో అంతస్తులో కాళ్లు చేతులు కట్టేసిఉండి… కాలిపోయిన కొడుకు మృతదేహం కనిపించింది. పక్కనే కిరోసిన్ డబ్బా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అక్కడ ఉన్న పరిస్థితులు, బాలిక చెబుతున్న మాటలను బట్టి వారికి ఆమెపై అనుమానం వచ్చింది. ఆమెని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.
16ఏళ్ల ఆ అమ్మాయి తన స్నేహితుడిని ప్రేమిస్తోందని పోలీసులు కనుగొన్నారు. తమ వ్యవహారం బయటపడుతుందని వారిద్దరే హత్యకు పాల్పడి ఉంటారనే కోణంలో దర్యాప్తు చేశారు. పోలీసుల ఇంటరాగేషన్లో బాలిక తొలుత ఒక బాలుడి పేరు చెప్పింది. పోలీసులు అతనికోసం గాలించగా అతను ఆ సమయంలో స్కూల్లో ఉన్నట్టుగా, అతనికి ఈ హత్యకు ఏ సంబంధం లేదని తేలింది. తరువాత బాలిక మరొక స్నేహితుడి పేరు చెప్పింది. కానీ అతను కూడా నిర్దోషి అని తేలింది. బాలిక మూడో స్నేహితుడి పేరు వెల్లడించింది. అయితే ఇతను పరారీలో ఉన్నాడు. పోలీసులు అతనికోసం గాలిస్తున్నారు.