ఇది కూడా జగన్‌ పనే

ప్రభుత్వం తన తప్పుల నుంచి గట్టెక్కేందుకు జగన్‌ను బాగానే ఉపయోగించుకుంటోంది. రాష్ట్రానికి పెట్టుబడులు ఎందుకు రావడం లేదంటే ”జగనే పెట్టుబడిదారులకు లేఖలురాసి అడ్డుకుంటున్నారు?” అని టీడీపీ పెద్దలు ఆరోపించారు. కాపు ఉద్యమం ఎందుకు ఈ స్థాయికి చేరిందంటే జగనే కాపులను రెచ్చిగొట్టాడు, ముద్రగడ వెనుక జగనే ఉన్నాడు అని చెప్పుకొచ్చారు. తునిలో రైలు తగలబడిపోవడానికి జగనే కారణమన్నారు. రాష్ట్ర విభజనకు కారణం ఎవరంటే వైఎస్‌ జగనే కాంగ్రెస్‌తో కుమ్మక్కు అయి రాష్ట్రాన్ని ముక్కలు చేశారని చంద్రబాబు( కేవలం ఏపీలోనే, […]

Advertisement
Update:2016-08-02 00:18 IST

ప్రభుత్వం తన తప్పుల నుంచి గట్టెక్కేందుకు జగన్‌ను బాగానే ఉపయోగించుకుంటోంది. రాష్ట్రానికి పెట్టుబడులు ఎందుకు రావడం లేదంటే ”జగనే పెట్టుబడిదారులకు లేఖలురాసి అడ్డుకుంటున్నారు?” అని టీడీపీ పెద్దలు ఆరోపించారు. కాపు ఉద్యమం ఎందుకు ఈ స్థాయికి చేరిందంటే జగనే కాపులను రెచ్చిగొట్టాడు, ముద్రగడ వెనుక జగనే ఉన్నాడు అని చెప్పుకొచ్చారు. తునిలో రైలు తగలబడిపోవడానికి జగనే కారణమన్నారు. రాష్ట్ర విభజనకు కారణం ఎవరంటే వైఎస్‌ జగనే కాంగ్రెస్‌తో కుమ్మక్కు అయి రాష్ట్రాన్ని ముక్కలు చేశారని చంద్రబాబు( కేవలం ఏపీలోనే, తెలంగాణకు వెళ్తే మాత్రం మా లేఖ వల్లే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని చెబుతుంటారు)ఆరోపిస్తుంటారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మంత్రి రావెల కిషోర్ బాబు తనయుడు కారులో నుంచి ముస్లిం మహిళ చేయిపట్టుకుని లాగి స్థానికుల చేతితో తన్నులు తిని రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఆ సమయంలోనూ తన కొడుకు ఈ కేసులో ఇరుక్కోవడానికి జగనే కారణమంటూ రావెల కిషోర్ బాబు ఆరోపించి రాష్ట్రం మొత్తం నవ్వుకునేలా చేశారు. ఇలా ఏ శాఖలో ఏ మంత్రికి సమస్య వచ్చిన వెంటనే జగన్ మీదకు తోసేస్తుంటారు. తాజాగా అదే ఎత్తుగడను మంత్రి దేవినేని ఉమా ప్రయోగించారు.

పట్టిసీమ నీటిని తీసుకెళ్లే పోలవరం కుడికాల్వకు గండిపడి ప్రభుత్వం పరువు గోదావరిలో కలిసిపోవడంతో దేవినేని కూడా జగన్‌ పేరును ఆశ్రయించారు. నేరుగా జగనే ఈ పనిచేయించారని అనకపోయినా పట్టిసీమ వల్ల రాజకీయంగా ఎదురుదెబ్బ తగులుతుందని భావించిన పార్టీయే కాల్వకు గండికొట్టిందని ఆరోపించారు. పోలవరం కాల్వ గండిపై వైసీపీ ఎందుకు మాట్లాడడం లేదంటూ లాజిక్ ఒకటి సృష్టించే ప్రయత్నంచేశారు ఉమ. అంతటితో ఆగితే వారు టీడీపీ నేతలు ఎలా అవుతారు?. అనుకూల మీడియా సాయంతో కథను మరింత రక్తికట్టించారు. కాల్వకు గండి పడడంపై చంద్రబాబు కూడా ఆరా తీశారట. ఇది విద్రోహక చర్యేనన్న నిర్ధారణకు వచ్చారని, కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారని అనుకూల మీడియా కథనాలు. అంటే ఇకపై పట్టిసీమ కాల్వకు గండిపడకుండా, మోటార్లు దెబ్బతినకుండా, పట్టిసీమకు అవసరమైన నీరు గోదావరిలో ఎప్పుడూ ప్రవహించేలా చూసుకునే బాధ్యత వైసీపీదేనన్న మాట. అందుకోసం వైసీపీ వాళ్లు నిత్యం పూజలు చేయాల్సిందేనన్న మాట. అలాకాకుండా పట్టిసీమ కాల్వలకు గండిపడినా, పట్టిసీమ మోటర్లు కాలిపోయినా, గోదావరిలో ప్రవాహం తగ్గినా అందుకు జగనే కారణమని టీడీపీ నేతలు భావించే ప్రమాదం ఉంది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News