బీజేపీని ఏమీ అనకండి : కేసీఆర్
మోదీ పర్యటన వేళ కమలనాథుల్లో కొత్త ఉత్సాహం ఉరకలెత్తుతోంది. అందుకే, అధికారపార్టీపై విమర్శల పదును పెంచారు. తమ పార్టీని, ముఖ్యంగా కేసీఆర్‌ని ఎవరు ఒక్కమాటన్నా పడని గులాబీనేతలు ఈ మాటలపై కినుక వహిస్తున్నారు. వస్తోన్న కోపాన్ని పంటి బిగువున భరిస్తున్నారు. ఎందుకంటారా? మోదీ పర్యటన పూర్తయ్యే వరకూ కమలనాథుల ఆరోపణలపై ఎవరూ స్పందించవద్దని కేసీఆర్ నుంచి పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న కమలనాథులు ముద్దు వచ్చినప్పుడే చంకనెక్కాలి అన్న చందంగా […]
Advertisement
మోదీ పర్యటన వేళ కమలనాథుల్లో కొత్త ఉత్సాహం ఉరకలెత్తుతోంది. అందుకే, అధికారపార్టీపై విమర్శల పదును పెంచారు. తమ పార్టీని, ముఖ్యంగా కేసీఆర్‌ని ఎవరు ఒక్కమాటన్నా పడని గులాబీనేతలు ఈ మాటలపై కినుక వహిస్తున్నారు. వస్తోన్న కోపాన్ని పంటి బిగువున భరిస్తున్నారు. ఎందుకంటారా? మోదీ పర్యటన పూర్తయ్యే వరకూ కమలనాథుల ఆరోపణలపై ఎవరూ స్పందించవద్దని కేసీఆర్ నుంచి పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న కమలనాథులు ముద్దు వచ్చినప్పుడే చంకనెక్కాలి అన్న చందంగా రోజురోజుకు మరింత చెలరేగిపోతున్నారు. కేసీఆర్ ను నియంత, అప్రజాస్వామికంగా పాలన చేస్తున్నాడని, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాడని బీజేపీలో అంతగా గుర్తింపులేని నాయకులు సైతం కేసీఆర్‌పై అంతెత్తున లేస్తున్నారు.
కేసీఆర్‌ని, ప్రభుత్వాన్ని బీజేపీ విమర్శించిన ప్రతిసారీ అంతకంటే వేగంగా స్పందించేవారు కేటీఆర్. ఇక కేసీఆర్‌కి భక్తుడిగా పేరొందిన పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ అయితే..మాటలతోనే ఉతికి ఆరేసేవాడు. ఇక ఎమ్మెల్సీ భాను చందర్, ఈటెల రాజేందర్ ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా పెద్దదిగా ఉండేది. వీరంతా బీజేపీ నేతలకంటే మాటకారులు. మాట్లాడుకునే సబ్జెక్టుపై మంచిపట్టు ఉన్నవారు. అయినా ఎందుకు ఆగుతున్నారంటే… కేసీఆర్ చెప్పాడు కాబట్టి. రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్రం అంతగా సాన్నిహిత్యం లేదు. ఇవ్వాల్సిన నిధులనే ఇవ్వడానికి నానా ఇబ్బందులు పెడుతోంది. విభజన సమస్యల విషయంలోనూ ఏపీకే అనుకూలంగా వ్యవహరిస్తోందన్నది జగమెరిగిన సత్యం. ఇవన్నీ పక్కనబెడితే.. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రతిష్టాత్మక, ఆదర్శవంతమైన ప్రాజెక్టులు ఇప్పటికే దేశంలోని పలు రాష్ర్టాలు ఈ పథకాలను ప్రశంసించాయి. ఈ పథకాలకు కేంద్రం నుంచి నిధులు రావాలి. నీతి ఆయోగ్ కూడా నిధులు విడుదల చేయాలని కేంద్రానికి సిఫారసు చేసింది. ఈ నిధులు వచ్చేదాకా బీజేపీని ఏమీ అనవద్దు అని కేసీఆర్ పార్టీ శ్రేణులకు స్పష్టం చేసినట్లు సమాచారం.
Advertisement