లీకేజీ వైఫల్యాన్ని అంగీకరించినట్లేనా?
ఎంసెట్-2 వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం తప్పు జరిగిందని అంగీకరించినట్లేనా? విజయవంతంగా సాగుతున్న పాలనకు లీకేజీ వ్యవహారం స్పీడ్‌బ్రేకర్‌గా నిలిచిందా? ఈ విషయంలో కేసీఆర్ స్పందన చూస్తోంటే ఈ మాటలే నిజమనిస్తున్నాయి. కానీ, ఈ పరిణామం ఓ గుణపాఠం కావాలని.. భవిష్యత్తులో ఇకపై తప్పులు జరగకుండా చూసుకోవాలని ఆయన అన్నారని సమాచారం. తాజాగా లీకేజీ వ్యవహారంపై కేసీఆర్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నిందితులెవరైనా వదలకూడదని, అందరిని కఠినంగా శిక్షించేలా నిస్పక్షపాతంగా విచారణ జరపాలని ఆదేశించారు. ఈ ఘటన […]
Advertisement
ఎంసెట్-2 వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం తప్పు జరిగిందని అంగీకరించినట్లేనా? విజయవంతంగా సాగుతున్న పాలనకు లీకేజీ వ్యవహారం స్పీడ్‌బ్రేకర్‌గా నిలిచిందా? ఈ విషయంలో కేసీఆర్ స్పందన చూస్తోంటే ఈ మాటలే నిజమనిస్తున్నాయి. కానీ, ఈ పరిణామం ఓ గుణపాఠం కావాలని.. భవిష్యత్తులో ఇకపై తప్పులు జరగకుండా చూసుకోవాలని ఆయన అన్నారని సమాచారం. తాజాగా లీకేజీ వ్యవహారంపై కేసీఆర్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నిందితులెవరైనా వదలకూడదని, అందరిని కఠినంగా శిక్షించేలా నిస్పక్షపాతంగా విచారణ జరపాలని ఆదేశించారు. ఈ ఘటన కూడా ఒకవిధంగా మంచికే జరిగిందని, ఇకపై జరిగే ప్రతి పోటీ పరీక్ష నిర్వహణపై నిఘాను తీవ్రతరం చేయాల్సిన విషయాన్ని ఇది సూచిస్తోందని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది.
రాష్ట్రం ఏర్పడ్డ తరువాత ఆత్మరక్షణ ధోరణిలో కేసీఆర్ మాట్లాడటం ఇదే తొలిసారి. సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తూ అభివృద్ధిలో దూసుకుపోతోన్న కేసీఆర్ సర్కారుకు ఇది భారీ కుదుపుగానే భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే..గతంలో ఆరోగ్యశాఖలో రూ.40 లక్షల అవినీతి జరిగిందన్న ఫిర్యాదుతో ఉపముఖ్యమంత్రినే భర్తరఫ్ చేసిన విషయం తెలిసిందే! లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వంలోని వారికి ఎలాంటి సంబంధం లేకపోవడంతో దర్యాప్తు మరింత వేగం పుంజుకుంది. ప్రభుత్వానికి అంటిన మరకను చెరిపేయాలంటే నిందితులందరినీ పట్టుకుని తీరాలి. అందుకే ఏకంగా 300 మంది పోలీసులతో దేశం మొత్తం నిందితుల కోసం గాలింపు చేపట్టింది తెలంగాణ సర్కారు. వీరందరికీ అయ్యే ఖర్చులను కూడా భరిస్తోంది. ఒకే ఒక్క కేసులో నిందితుల కోసం దాదాపు 300మంది పోలీసులు గాలించడం ఇటీవల కాలంలో ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు. మొత్తానికి తమ ప్రభుత్వానికి అంటిన మరకను సాధ్యమైనంత త్వరగా చెరిపేసుకోవాలని పట్టుదలలో ఉన్నారు సీఎం కేసీఆర్!
Advertisement