వైఎస్‌ భగీరథ విగ్రహం కూల్చివేత... లగడపాటి బృందం స్పందిస్తారా?

బెజవాడలో 40కిపైగా ఆలయాలను కూల్చివేయించిన చంద్రబాబు ఇప్పుడు వైఎస్ విగ్రహాలను టార్గెట్ చేశారు. పోలీస్ కంట్రోల్‌రూమ్ సమీపంలో వైఎస్ భారీ విగ్రహాన్ని అర్థరాత్రి తొలగించారు. భారీ క్రేన్ లు, ప్రొక్లెయినర్లు తెచ్చి విగ్రహాన్ని తొలగించారు. 2009లో అప్పటి ఎంపీ లగడపాటి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ నేతలు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వైఎస్ జలయజ్ఞానికి గుర్తుగా పోలవరం ప్రాజెక్టు డిజైన్‌పై వైఎస్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే రోడ్డు విస్తరణ పేరుతో అర్థరాత్రి విగ్రహాన్ని తొలగించారు. విషయం […]

Advertisement
Update:2016-07-30 03:46 IST

బెజవాడలో 40కిపైగా ఆలయాలను కూల్చివేయించిన చంద్రబాబు ఇప్పుడు వైఎస్ విగ్రహాలను టార్గెట్ చేశారు. పోలీస్ కంట్రోల్‌రూమ్ సమీపంలో వైఎస్ భారీ విగ్రహాన్ని అర్థరాత్రి తొలగించారు. భారీ క్రేన్ లు, ప్రొక్లెయినర్లు తెచ్చి విగ్రహాన్ని తొలగించారు. 2009లో అప్పటి ఎంపీ లగడపాటి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ నేతలు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వైఎస్ జలయజ్ఞానికి గుర్తుగా పోలవరం ప్రాజెక్టు డిజైన్‌పై వైఎస్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే రోడ్డు విస్తరణ పేరుతో అర్థరాత్రి విగ్రహాన్ని తొలగించారు.

విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు వంగవీటి రాధా, జోగి రమేష్‌, కార్యకర్తలు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. నోటీసు కూడా ఇవ్వకుండా విగ్రహం కూల్చివేయడం బట్టి చంద్రబాబుకు వైఎస్‌ అంటే ఎంత కక్ష ఉందో అర్థమవుతోందని వైసీపీ నేతలు ఆరోపించారు. తమకు నోటీస్ కూడా ఇవ్వకుండా విగ్రహాన్ని కూల్చివేశారని లగడపాటి ఆఫీస్‌ సిబ్బంది చెబుతున్నారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న విగ్రహాలను తొలగించకుండా… కేవలం వైఎస్‌ విగ్రహాన్ని కావాలనే తొలగించారని మండిపడుతున్నారు. వైఎస్ విగ్రహాన్ని చూసి ఓర్చుకోలేకే చంద్రబాబు ఇలాంటి నీచానికి పాల్పడడ్డారని విమర్శించారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News