రమణ రాజకీయ అస్త్ర సన్యాసం?
తెలంగాణ తెలుగుదేశంలో ఎల్.రమణ బీసీ నేతగా పార్టీలోనూ, ప్రజల్లోనూ చక్కటి గుర్తింపు సాధించారు. అలాంటి నేత ఇకపై రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకోవాలని నిర్ణయించుకున్నారట. ఇకపై తాను ఎన్నికల్లో పోటీ చేసినా గెలుస్తానన్న గ్యారెంటీ లేకపోవడం.. కేటీఆర్ , జీవన్‌రెడ్డిల వంటి హేమాహేమీలతో పోటీపడలేకపోవడం, రోజురోజుకు పార్టీ కేడర్ క్షీణిస్తోండటంతో రమణ రాజకీయ అస్త్ర సన్యాసం చేయాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారని తెలిసింది. కారణాలు ఇవే! రమణ రాజకీయ […]
Advertisement
తెలంగాణ తెలుగుదేశంలో ఎల్.రమణ బీసీ నేతగా పార్టీలోనూ, ప్రజల్లోనూ చక్కటి గుర్తింపు సాధించారు. అలాంటి నేత ఇకపై రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకోవాలని నిర్ణయించుకున్నారట. ఇకపై తాను ఎన్నికల్లో పోటీ చేసినా గెలుస్తానన్న గ్యారెంటీ లేకపోవడం.. కేటీఆర్ , జీవన్‌రెడ్డిల వంటి హేమాహేమీలతో పోటీపడలేకపోవడం, రోజురోజుకు పార్టీ కేడర్ క్షీణిస్తోండటంతో రమణ రాజకీయ అస్త్ర సన్యాసం చేయాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారని తెలిసింది.
కారణాలు ఇవే!
రమణ రాజకీయ అస్త్ర సన్యాసం చేయడం వెనక చాలా బలమైన కారణాలే ఉన్నాయి. జగిత్యాల, సిరిసిల్ల ప్రాంతాల్లో రమణ బలమైన బీసీ నేతగా ఎదిగారు. 2009లో నియోజకవర్గ పునర్విభజన తొలుత రమణకు కలిసి వచ్చి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎన్టీఆర్‌కు, తెలుగుదేశం పార్టీకి రమణ వీరవిధేయుడు. అందుకే, తెలంగాణ ఉద్యమంలో పార్టీ ఆదేశాలకు విరుద్ధంగా వెళ్లలేదు. మలిదశ తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటి నుంచి రమణ నియోజకవర్గ ప్రజలకు ముఖం చాటేశాడు. ఇంటి తలుపులకు లోపల నుంచి బలంగా గడియ వేసుకున్నట్లుగా 2014 ఎన్నికల దాకా ప్రజల మధ్యకు వచ్చే ధైర్యం చేయలేకపోయారు. ఫలితం 2014లో ఘోర పరాజయం. పైగా తన చిరకాల ప్రత్యర్థి జీవన్‌రెడ్డి చేతిలో చిత్తుగా ఓడిపోయాడు. కనీసం నియోజకవర్గం మార్చుకుందామని ప్రయత్నాలు చేశారు. రమణ పద్మశాలీ సామాజికవర్గానికి చెందినవాడు. అందుకే, సిరిసిల్ల నుంచి పోటీ చేద్దామని ఆలోచించాడు. కానీ, ఇప్పటికే అక్కడ కేటీఆర్ పాతుకుపోయాడు. సిరిసిల్లను జిల్లా చేశాడు. అక్కడి నేత కార్మికులకు కోట్ల కొద్ది ప్రభుత్వ కాంట్రాక్టులు ఇప్పిస్తున్నాడు. అక్కడికెళ్లినా కులసమీకరణాలు పనిచేయవని తేలిపోయింది. దీంతో రమణ పరిస్థితి దిక్కుతోచకుండా తయారైంది. 2014లో ఓటమితో ఆర్థికంగా కష్టాలు మొదలయ్యాయి. 2019 దాకా కేడర్ నిర్వహణ అంటే మరింత వ్యయమవుతుంది. అందుకే, ఇక ఆయన రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకోవాలని నిర్ణయించుకున్నారని తెలిసింది.
Advertisement