2019లో వైసీపీని ఊడ్చేయాలి, ఒబామాను బాబు ఫాలో అవుతారు " పుల్లారావు

వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఒక్కస్థానం కూడా దక్కకుండా ఊడ్చిపారేయాలని మంత్రి పత్తిపాటి పుల్లారావు పిలుపునిచ్చారు. గురువారం గుంటూరు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో జరిగిన విద్యార్థి సదస్సులో మాట్లాడిన పుల్లారావు… అమెరికా ఎన్నికల ప్రచారానికి ఆ దేశ అధ్యక్షుడు ఒబామా వాడిన సాంకేతిక పరిజ్ఞానాన్ని త్వరలో  చంద్రబాబు కూడా వినియోగించనున్నారని చెప్పారు. అన్ని పథకాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజల సెల్‌ఫోన్లకు పంపేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. టీడీపీ గెలుపులో టీఎన్‌ఎస్‌ఎఫ్ పాత్ర చాలా కీలకమైనదని పుల్లారావు చెప్పారు. […]

Advertisement
Update:2016-07-29 03:35 IST

వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఒక్కస్థానం కూడా దక్కకుండా ఊడ్చిపారేయాలని మంత్రి పత్తిపాటి పుల్లారావు పిలుపునిచ్చారు. గురువారం గుంటూరు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో జరిగిన విద్యార్థి సదస్సులో మాట్లాడిన పుల్లారావు… అమెరికా ఎన్నికల ప్రచారానికి ఆ దేశ అధ్యక్షుడు ఒబామా వాడిన సాంకేతిక పరిజ్ఞానాన్ని త్వరలో చంద్రబాబు కూడా వినియోగించనున్నారని చెప్పారు. అన్ని పథకాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజల సెల్‌ఫోన్లకు పంపేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. టీడీపీ గెలుపులో టీఎన్‌ఎస్‌ఎఫ్ పాత్ర చాలా కీలకమైనదని పుల్లారావు చెప్పారు.

ప్రభుత్వంపై జగన్ మీడియా తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని మరో మంత్రి రావెల కిషోర్ బాబు పిలుపునిచ్చారు. గత ప్రభుత్వాలు పేదరికాన్ని పెంచిపోషించాయని విమర్శించారు రావెల.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News