చిన్నారులతో కలిసి...ఇద్దరు తల్లుల ఆత్మహత్య!
మహిళల నిండునూరేళ్ల జీవితాలు అర్థంతరంగా ముగుస్తున్న సంఘటన పెరిగిపోతున్నాయి. వీటికి మనం… కుటుంబ కలహాలు, ప్రేమ సమస్యలు, సైబర్ నేరాలు…లాంటి పేర్లు పెట్టుకుని… అవే కారణాలని అనుకుంటున్నాం. కానీ వీటి వెనుక ఉన్న ఆడా మగా అసమాత్వం, స్త్రీల పట్ల వివక్ష, పురుషాధిపత్యం, స్త్రీని విలాస వస్తువుగా చూసే సంస్కృతి …కోణాలను పట్టించుకోవటం మానేశాం. ఈ నేపథ్యంలో మహిళల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా కుటుంబ కలహాలతో బిడ్డలతో సహా ఆత్మహత్యలకు పాల్పడుతున్న తల్లుల సంఖ్య పెరుగుతోంది. వరంగల్ […]
మహిళల నిండునూరేళ్ల జీవితాలు అర్థంతరంగా ముగుస్తున్న సంఘటన పెరిగిపోతున్నాయి. వీటికి మనం… కుటుంబ కలహాలు, ప్రేమ సమస్యలు, సైబర్ నేరాలు…లాంటి పేర్లు పెట్టుకుని… అవే కారణాలని అనుకుంటున్నాం. కానీ వీటి వెనుక ఉన్న ఆడా మగా అసమాత్వం, స్త్రీల పట్ల వివక్ష, పురుషాధిపత్యం, స్త్రీని విలాస వస్తువుగా చూసే సంస్కృతి …కోణాలను పట్టించుకోవటం మానేశాం. ఈ నేపథ్యంలో మహిళల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా కుటుంబ కలహాలతో బిడ్డలతో సహా ఆత్మహత్యలకు పాల్పడుతున్న తల్లుల సంఖ్య పెరుగుతోంది.
వరంగల్ జిల్లా మహబూబాబాద్ డివిజన్లోని కేసముద్రం మండలం ఇంటికన్నె రైల్వే స్టేషన్ సమీపంలో అలివేలు (22) అనే మహిళ తన సంవత్సరం కుమారుడితో కలిసి రైలుకింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఇంటికన్నె గ్రామానికి చెందిన శ్రీనివాస్, అలివేలు ప్రేమించి వివాహం చేసుకున్నారు. శ్రీనివాస్ బిటెక్ చదువుతున్నపుడే అలివేలుని వివాహం చేసుకున్నాడు. కొద్దిరోజులుగా వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో అలివేలు కుమారుడితో కలిసి గురువారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడింది.
మరో సంఘటనలో హైదరాబాద్ కాచీగూడలోని కుద్బిగూడలో మరో మహిళ తన రెండేళ్ల కుమార్తెతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. రేణుక (35), తన కుమార్తె ఐశ్వర్య (2)తో కలిసి మీరానికేతన్ అపార్ట్మెంట్పై నుండి దూకింది. ఈ ఘటనలో తల్లీ కూతుళ్లు ఇద్దరు మృతి చెందారు. కుటుంబ కలహాలే ఇందుకు కారణమని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.