ఫిరాయింపు నేత పదేపదే ఫోన్ చేసి వాపోయాడు " లోకేష్

నిజమో లేక కథనో గానీ పార్టీ ఫిరాయించిన నేతల గురించి నారా లోకేష్ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. పార్టీ కార్యకర్తలకు సంక్షేమనిధి చెక్కుల పంపిణీకార్యక్రమంలో ప్రసంగించిన లోకేష్… టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన టీడీపీ నేతల పరిస్థితి ఏమాత్రం బాగోలేదన్నారు. అందుకు బలం చేకూర్చే ప్రయత్నంలో భాగంగా ఒక విషయాన్ని కూడా చెప్పారు. ‘‘టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఒకాయన ఈ మధ్య నాకు పదేపదే ఫోన్ చేశాడు. ఓసారి మాట్లాడితే పోలా.. అని ఫోన్ ఎత్తి, బాగున్నావా? […]

Advertisement
Update:2016-07-29 04:14 IST

నిజమో లేక కథనో గానీ పార్టీ ఫిరాయించిన నేతల గురించి నారా లోకేష్ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. పార్టీ కార్యకర్తలకు సంక్షేమనిధి చెక్కుల పంపిణీకార్యక్రమంలో ప్రసంగించిన లోకేష్… టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన టీడీపీ నేతల పరిస్థితి ఏమాత్రం బాగోలేదన్నారు. అందుకు బలం చేకూర్చే ప్రయత్నంలో భాగంగా ఒక విషయాన్ని కూడా చెప్పారు.

‘‘టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఒకాయన ఈ మధ్య నాకు పదేపదే ఫోన్ చేశాడు. ఓసారి మాట్లాడితే పోలా.. అని ఫోన్ ఎత్తి, బాగున్నావా? అని అడిగిన. ఏం బాగున్నమన్నా, ఇక్కడేం బాగలేదు. పార్టీలో చేరే ముందు సీఎం కేసీఆర్‌ నాతో మూడు గంటలు మాట్లాడిండు. బ్రేక్‌ఫాస్ట్‌ కూడా ఇచ్చిండు. ఇగొ ఇప్పటి వరకు మళ్ల కలవనియ్యలే. అంటూ తన గోడు వెళ్లబోసుకున్నడు’’ అని లోకేశ్ చెప్పారు. ‘‘మరి, మీ ఇంచార్జి మంత్రితో మాట్లాడకపోయినవా? అంటే.. అన్నా, నీకు నోరున్నది నాకు చెప్పుకున్నవు. నేను మంత్రిని. నాకు నోరు లేదు. అంటూ సదరు మంత్రి జవాబిచ్చారని ఆ నాయకుడు వాపోయినడు’’ అని లోకేశ్‌ వివరించారు.

పాలన వదిలేసి ఫాంహౌజ్‌లో పడుకుంటే ఇలాగే ఉంటుందని కేసీఆర్‌ను లోకేష్ ఎద్దేవా చేశారు. తెలంగాణలో దొరల పాలనను తరిమికొట్టే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. అయితే టీఆర్ఎస్‌లో చేరిన టీడీపీ నేత తనకు ఫోన్‌ చేశారని లోకేష్ చెప్పిన విషయం … కేవలం ఇకముందు టీటీడీపీ నేతలెవ్వరూ టీఆర్‌ఎస్‌లోకి వెళ్లకుండా చేసేందుకు చెప్పి ఉంటారని మరికొందరు భావిస్తున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News