చంద్రబాబుపై కేఈ సెటైర్లు

ఇటీవల చంద్రబాబు ఏ సర్వే చేయించినా అందులో రెవెన్యూ శాఖకు అవినీతిలో నెంబర్ వన్ ర్యాంకు ఇస్తున్నారు. దీంతో ప్రతిసారి రెవెన్యూ శాఖ ఇరుకునపడుతోంది. రెవెన్యూశాఖను పర్యవేక్షిస్తున్న కేఈ కృష్ణమూర్తికి తోటి మంత్రుల వద్ద ఇదో అవమానంగా తయారైందని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ శాఖలో అవినీతిపై కేఈ. కృష్ణమూర్తి స్పందించారు. చంద్రబాబు సర్వేను ప్రస్తావించిన కేఈ… ”సీఎం లెక్కల ప్రకారం రెవెన్యూశాఖలో 42శాతం అవినీతి ఉంది. అంటే శాఖ మొత్తం అవినీతిమయం కాలేదు. కాబట్టి శాఖలో […]

Advertisement
Update:2016-07-29 03:29 IST

ఇటీవల చంద్రబాబు ఏ సర్వే చేయించినా అందులో రెవెన్యూ శాఖకు అవినీతిలో నెంబర్ వన్ ర్యాంకు ఇస్తున్నారు. దీంతో ప్రతిసారి రెవెన్యూ శాఖ ఇరుకునపడుతోంది. రెవెన్యూశాఖను పర్యవేక్షిస్తున్న కేఈ కృష్ణమూర్తికి తోటి మంత్రుల వద్ద ఇదో అవమానంగా తయారైందని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ శాఖలో అవినీతిపై కేఈ. కృష్ణమూర్తి స్పందించారు. చంద్రబాబు సర్వేను ప్రస్తావించిన కేఈ… ”సీఎం లెక్కల ప్రకారం రెవెన్యూశాఖలో 42శాతం అవినీతి ఉంది. అంటే శాఖ మొత్తం అవినీతిమయం కాలేదు. కాబట్టి శాఖలో ఇంకా 58 శాతం నిజాయితీగా పనిచేస్తున్నారు” అన్న విషయాన్ని గమనించాలి అని అన్నారు.

రెవెన్యూ శాఖలో అందరూ మహాత్మగాంధీలే ఉండరని కేఈ వ్యాఖ్యానించారు. రెవెన్యూశాఖ మొత్తం అవినీతిమయం అయిందన్నట్టుగా ప్రచారం చేయడం మానుకోవాలన్నారు. బుధవారం సీఎం నిర్వహించిన రెవెన్యూ శాఖ సమావేశాన్ని గురించి కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించి కథనాలు రాస్తున్నాయన్నారు. రెవెన్యూ అవినీతిపై కథనాలు రాసినందుకే సీఎం ఆ సమావేశాన్ని నిర్వహించారంటూ కొందరు కాలర్ ఎగరేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. మొత్తం మీద సీఎం పదేపదే రెవెన్యూ శాఖకు అవినీతిలో ప్రథమ స్థానం ఇవ్వడం కేఈకి కాస్త కోపం తెప్పించినట్టుగానే ఉంది. రెవెన్యూ శాఖ మొత్తం అవినీతిమయమైందన్నట్టుగా ప్రచారం చేయడం మానుకోవాలని సీఎంను ఉద్దేశించే కేఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చంటున్నారు. ఎందుకంటే రాజధాని భూసమీకరణ మొదలుకుని ప్రతివిషయంలోనూ కేఈని చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ టార్గెట్ చేస్తూనే ఉన్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News