ఎంసెట్-2 రద్దుపై నిర్ణయం వెలువరించిన ప్రభుత్వం
తెలంగాణ ఎంసెట్-2 రద్దు అయింది. పేపర్ లీకేజ్ నేపథ్యంలో ఎంసెట్ -2ను రద్దు చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. పరీక్ష రద్దుపై కేసీఆర్ అధికారులతో సుధీర్ఘంగా చర్చించారు. పరీక్ష రద్దు చేయకపోతే న్యాయపరమైన చిక్కులు వస్తాయని అధికారులు వివరించారు. దీంతో ఎంసెట్-2 రద్దుకు కేసీఆర్ ఆదేశించారు. ఎంసెట్-3 నిర్వాహణకు వేగంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సోమవారం ఎంసెట్-3 షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఆగస్టు ఆఖరిలో పరీక్ష నిర్వహించే చాన్స్ ఉంది. ఎంసెట్-2కు హాజరైన విద్యార్థులు ఎలాంటి ఫీజు […]
తెలంగాణ ఎంసెట్-2 రద్దు అయింది. పేపర్ లీకేజ్ నేపథ్యంలో ఎంసెట్ -2ను రద్దు చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. పరీక్ష రద్దుపై కేసీఆర్ అధికారులతో సుధీర్ఘంగా చర్చించారు. పరీక్ష రద్దు చేయకపోతే న్యాయపరమైన చిక్కులు వస్తాయని అధికారులు వివరించారు. దీంతో ఎంసెట్-2 రద్దుకు కేసీఆర్ ఆదేశించారు. ఎంసెట్-3 నిర్వాహణకు వేగంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సోమవారం ఎంసెట్-3 షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఆగస్టు ఆఖరిలో పరీక్ష నిర్వహించే చాన్స్ ఉంది. ఎంసెట్-2కు హాజరైన విద్యార్థులు ఎలాంటి ఫీజు చెల్లించకుండానే తిరిగి పరీక్ష రాసే అవకాశం ఇవ్వనున్నారు. పేపర్ లీక్ చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేసీఆర్ ఆదేశించారు.
Click on Image to Read: