ఇంకెప్పుడు ఇస్తారు సార్.. బాబునే ప్రశ్నించిన జలీల్
అభివృద్ధి కోసమే టీడీపీలో చేరానని చెబుతూ వచ్చిన విజయవాడ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అసలువిషయం చంద్రబాబు ముందే బయటపెట్టారు. విజయవాడ పాతబస్తీలో 10 కోట్లతో నిర్మించే షాదీ ఖానాకు శంకుస్థాపన చేసేందుకు చంద్రబాబు వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జలీల్ ఖాన్ మాట్లాడారు. ”ముస్లింలకు మంత్రి పదవి ఇస్తామన్నారు కదా సర్… ఎప్పుడిస్తారు” అని జలీల్ ఖాన్ ప్రశ్నించారు. ”ముస్లిములు కూడా ఈ విషయంలో అడుగుతున్నారు… కాబట్టి మైనార్టీలకు ఏదో ఒకటి కాకుండా ఒక మంచి […]
అభివృద్ధి కోసమే టీడీపీలో చేరానని చెబుతూ వచ్చిన విజయవాడ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అసలువిషయం చంద్రబాబు ముందే బయటపెట్టారు. విజయవాడ పాతబస్తీలో 10 కోట్లతో నిర్మించే షాదీ ఖానాకు శంకుస్థాపన చేసేందుకు చంద్రబాబు వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జలీల్ ఖాన్ మాట్లాడారు. ”ముస్లింలకు మంత్రి పదవి ఇస్తామన్నారు కదా సర్… ఎప్పుడిస్తారు” అని జలీల్ ఖాన్ ప్రశ్నించారు. ”ముస్లిములు కూడా ఈ విషయంలో అడుగుతున్నారు… కాబట్టి మైనార్టీలకు ఏదో ఒకటి కాకుండా ఒక మంచి శాఖ ఇవ్వండి సార్” అని సభలో అడిగారు. దీంతో కాసేపు చంద్రబాబు కూడా ఆశ్చర్యానికి లోనయ్యారు.
మంత్రి పదవిపై జలీల్ ఖాన్ ఎంత ఆతృతగా ఉన్నారన్న విషయం ఈ మాటలతో అర్థమైపోయిందంటున్నారు. పార్టీ మారినప్పటి నుంచి జలీల్ ఖాన్ చంద్రబాబుపై ఈగ వాలినా సహించడం లేదు. టీడీపీ నేతల కంటే దూకుడుగా ప్రతిపక్షాలపై విరుచుకుపడేవారు. ఇదంతా మంత్రి పదవి కోసమేనని అందరూ అంటుంటారు. అయినా సరే మంత్రి పదవిపై చంద్రబాబు నుంచి కొత్తగా ఎలాంటి సంకేతాలు అందకపోయే సరికి ఇక లాభం లేదనుకున్నజలీల్ ఖాన్ నేరుగా సభలో చంద్రబాబును ప్రశ్నించారని చెబుతున్నారు.
Click on Image to Read: