ఇందిరకు వ్యతిరేకంగా జైపాల్ వ్యాఖ్యలు
కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి మరోసారి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా పోరాడిన ఆయన ఇప్పుడు మరోసారి సొంతపార్టీనే తన విమర్శలతో ఇరుకున పెట్టారు. మల్లన్నసాగర్ విషయంలో టీఆర్ ఎస్ సర్కారును ఎండగట్టే క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలానికి దారి తీశాయి. మల్లన్నసాగర్ భూనిర్వాసితులను పరామర్శించేందుకు బయల్దేరిన కాంగ్రెస్ నేతలను గాంధీభవన్‌లోనే అరెస్టు చేశారు పోలీసులు. ఇక మెదక్ ని అష్టదిగ్బంధనం చేసి జిల్లాలోకి ఏ ప్రతిపక్ష […]
Advertisement
కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి మరోసారి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా పోరాడిన ఆయన ఇప్పుడు మరోసారి సొంతపార్టీనే తన విమర్శలతో ఇరుకున పెట్టారు. మల్లన్నసాగర్ విషయంలో టీఆర్ ఎస్ సర్కారును ఎండగట్టే క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలానికి దారి తీశాయి. మల్లన్నసాగర్ భూనిర్వాసితులను పరామర్శించేందుకు బయల్దేరిన కాంగ్రెస్ నేతలను గాంధీభవన్‌లోనే అరెస్టు చేశారు పోలీసులు. ఇక మెదక్ ని అష్టదిగ్బంధనం చేసి జిల్లాలోకి ఏ ప్రతిపక్ష నాయకుడినీ అనుమతించలేదు. దీనిపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. అందులోనూ జైపాల్ రెడ్డి స్టయిలే వేరు కదా! అందుకే ఆయన కాస్త భిన్నంగా స్పందించారు.
టీఆర్ ఎస్ ప్రభుత్వం తీరు ప్రజాస్వామ్య యుతంగా లేదని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ పాలన ఎమర్జెన్సీనాటి రోజులను తలపిస్తోందని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలకు నిరసన తెలిపే అవకాశం కూడా ఇవ్వకపోవడం ఏంటని ఆయన వాపోయారు. అయితే, జైపాల్ రెడ్డి వ్యాఖ్యలను సొంతపార్టీ నేతలే తప్పుబడుతున్నారు. ఇందిరాగాంధీ అప్పట్లో దేశంలో ఎమర్జెన్సీ విధించినపుడు దానిని వ్యతిరేకించి కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చారు జైపాల్ రెడ్డి. తరువాత జనతాపార్టీలో చేరి కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా పోరాడారు. అదంతా గతం. తరువాత ఆయన తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. వివిధ కేంద్రమంత్రిత్వ శాఖలను నిర్వహించారు. తీరా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ ఎమర్జెన్సీ ఊసెత్తడం ఏంటని సొంతపార్టీ నేతలే ముక్కున వేలేసుకుంటున్నారు. దేశంలో ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీని విమర్శించేందుకు ఎమర్జెన్సీని మంచి అస్ర్తంలా వాడుకుంటాయి. అలాంటి అస్ర్తాన్ని ప్రతిపక్షాల మీద ప్రయోగించడం అంతలా బాగాలేదని, ఇదిసొంత పార్టీని ఇరకాటంలో పెట్టడమేనని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
Advertisement