ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కేంద్రం గట్టి షాక్

తెలుగు రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు కేంద్ర ప్రభుత్వం గట్టి షాకే ఇచ్చింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల నాటికి అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరుగుతుందని… ఆ పెరిగిన స్థానాల్లో టికెట్లు కేటాయిస్తామని నమ్మించి అనేక మంది వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు పార్టీలో చేర్చుకున్నారు. చంద్రబాబు స్నేహితులు వెంకయ్యనాయుడు కూడా సీట్లు పెంచుతామంటూ తాళం వేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు రాజ్యసభ వేదికగా కేంద్రం ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల్లో సీట్లు పెంపుపై ప్రకటన చేసింది. టీడీపీ ఎంపీ […]

Advertisement
Update:2016-07-27 12:57 IST

తెలుగు రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు కేంద్ర ప్రభుత్వం గట్టి షాకే ఇచ్చింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల నాటికి అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరుగుతుందని… ఆ పెరిగిన స్థానాల్లో టికెట్లు కేటాయిస్తామని నమ్మించి అనేక మంది వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు పార్టీలో చేర్చుకున్నారు. చంద్రబాబు స్నేహితులు వెంకయ్యనాయుడు కూడా సీట్లు పెంచుతామంటూ తాళం వేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు రాజ్యసభ వేదికగా కేంద్రం ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల్లో సీట్లు పెంపుపై ప్రకటన చేసింది. టీడీపీ ఎంపీ దేవేందర్‌ గౌడ్‌ అడిగిన ప్రశ్నకు బుధవారం సమాధానం ఇచ్చిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్సరాజు గంగరామ్‌ …తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు కుదరదని తేల్చేశారు.

రాష్ట్ర విభజన నేపథ్యంలో సీట్ల సంఖ్య పెంచాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కేంద్రాన్ని కోరాయి. దీనిపై కేంద్ర హోంశాఖ… అటార్నీ జనరల్‌ను సలహా కోరింది. ఇందుకు స్పందించిన అటార్నీజనరల్ తెలుగు రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య పెంపు కుదరదని… అందుకు రాజ్యాంగం ఒప్పుకోదని కేంద్రానికి సూచించారు. ఈ విషయాన్ని రాజ్యసభలో వివరించిన మంత్రి గంగారామ్‌ 2026వరకు సీట్లు సంఖ్య పెంపు ఉండదని తేల్చేశారు. దీంతో ఇప్పుడు ఏపీలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో కొందరి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఒకే నియోజకవర్గంలో ఇద్దరు బలమైన నాయకులున్న చోట వచ్చే ఎన్నికల సమయంలో ఫైట్ తప్పకపోవచ్చు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News