కేసీఆర్ కు 'ఆ' అవార్డు ఇస్తారట!
మాజీ మంత్రి, కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ డీకే అరుణ మరోసారి తెలంగాణ సీఎంపై విరుచుకుపడ్డారు. మొన్నటికి మొన్న అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవందర్‌రెడ్డిపై నోరు పారేసుకున్న డీకే అరుణ ఈసారి ముఖ్యమంత్రిని విమర్శలతో చీల్చి చెండాడారు. కేసీఆర్‌ని విమర్శించే క్రమంలో చాలా పరుషపదజాలంతో ఘాటైన హెచ్చరికలు చేశారు. జలసాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన నారాయణపేట- కొడంగల్ ప్రాజెక్టు మహా పాదయాత్ర మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేటకు చేరుకున్న సందర్భంగా ఆమె కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక కేసీఆర్ […]
Advertisement
మాజీ మంత్రి, కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ డీకే అరుణ మరోసారి తెలంగాణ సీఎంపై విరుచుకుపడ్డారు. మొన్నటికి మొన్న అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవందర్‌రెడ్డిపై నోరు పారేసుకున్న డీకే అరుణ ఈసారి ముఖ్యమంత్రిని విమర్శలతో చీల్చి చెండాడారు. కేసీఆర్‌ని విమర్శించే క్రమంలో చాలా పరుషపదజాలంతో ఘాటైన హెచ్చరికలు చేశారు. జలసాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన నారాయణపేట- కొడంగల్ ప్రాజెక్టు మహా పాదయాత్ర మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేటకు చేరుకున్న సందర్భంగా ఆమె కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక కేసీఆర్ సాధించిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ఆయనపై జనం ఆగ్రహంగా ఉన్నారని, తన్నే రోజులు ముందే ఉన్నానయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
పాలమూరు ఎంపీగా గెలిచి ఏం సాధించావ్? అని ఏకవచనంతో సంబోధించారు. జిల్లాలో కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులను పూర్తి చేయడంలో విఫలమయ్యావు? అని ఎద్దేవా చేశారు. బాంచెన్ దొరా అంటూ ప్రజలంతా నీ కాళ్ల దగ్గర పడి ఉంటారనుకుంటున్నావా.. ఈ ప్రాజెక్టులు పూర్తికాకపోతే.. నిన్ను తన్నే రోజులు ముందే ఉన్నాయి అంటూ హెచ్చరించారు. ప్రజాసంక్షేమాన్ని పూర్తిగా మరిచిపోయి కేవలం అబ్దదాలతో కాలం వెళ్లదీస్తున్నాడని కేసీఆర్‌పై మండిపడ్డారు. కేసీఆర్‌కు అబద్దాల కోరు అవార్డు ఇవ్వవచ్చు అని కూడా విమర్శించారు.
డీకే అరుణ వ్యాఖ్యలను గులాబీనేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. పదేళ్లు కేంద్రం, రాష్ర్టంలో మీ పార్టీ అధికారంలో ఉంది, పైగా మీరు మంత్రిగా ఉన్నారు మరి.. ఈ ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదు? అని డీకేను ప్రశ్నిస్తున్నారు. పదేళ్లు కాలయాపన చేసి, అధికారం కోల్పోయాక మీకు ప్రజా సమస్యలు గుర్తుకురావడం హాస్యాస్పదం అని విమర్శిస్తున్నారు. సీఎం అన్న కనీస మర్యాద మరిచి, నోటికొచ్చినట్లు మాట్లాడటం ఆమె విచక్షణ, విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు.
Advertisement