పాకిస్తాన్ కు ఇక భయం అక్కర్లేదు...

అమరావతి నిర్మాణం ఎప్పుడు ప్రారంభమవుతుందో అది ఎప్పుడు పూర్తవుతుందో గానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం రోజుకో త్రీడి బొమ్మ విడుదల చేస్తూ కనువిందు చేస్తోంది. ఆ మధ్య తనకు ఇష్టమైన సింగపూర్ కంపెనీలకు అమరావతి డిజైన్ పనులను చంద్రబాబు అప్పగించారు. అయితే సింగపూర్‌ కంపెనీ ఇచ్చిన డిజైన్‌ను చూసి అందరూ నవ్వుకున్నారు. సదరు డిజైన్‌పై పాకిస్తాన్‌లోనూ భయంకరమైన చర్చ జరిగింది. సింగపూర్‌ కంపెనీ ఇచ్చిన డిజైన్ కిరోసిన్‌ కొలిచే డబ్బాలాగా, పొగ గొట్టాల తరహాలో ఉండడంతో నెగిటివ్ […]

Advertisement
Update:2016-07-26 05:59 IST

అమరావతి నిర్మాణం ఎప్పుడు ప్రారంభమవుతుందో అది ఎప్పుడు పూర్తవుతుందో గానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం రోజుకో త్రీడి బొమ్మ విడుదల చేస్తూ కనువిందు చేస్తోంది. ఆ మధ్య తనకు ఇష్టమైన సింగపూర్ కంపెనీలకు అమరావతి డిజైన్ పనులను చంద్రబాబు అప్పగించారు. అయితే సింగపూర్‌ కంపెనీ ఇచ్చిన డిజైన్‌ను చూసి అందరూ నవ్వుకున్నారు. సదరు డిజైన్‌పై పాకిస్తాన్‌లోనూ భయంకరమైన చర్చ జరిగింది.

సింగపూర్‌ కంపెనీ ఇచ్చిన డిజైన్ కిరోసిన్‌ కొలిచే డబ్బాలాగా, పొగ గొట్టాల తరహాలో ఉండడంతో నెగిటివ్ టాక్ వచ్చింది. అంతేకాదు పాక్ మీడియా అమరావతి డిజైన్‌ను న్లూక్లియర్‌ ప్లాంట్‌గా భ్రమించింది. మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో భారీగా న్యూక్లియర్ ప్లాంట్ నిర్మిస్తోందని ఇది అదేనంటూ అమరావతి డిజైన్‌ను చూపిస్తూ రెండు రోజుల పాటు పాకిస్తాన్‌ టీవీలు రచ్చరచ్చ చేశాయి. దీంతో ఏపీ ప్రభుత్వం ఇబ్బందికరపరిస్థితిని ఎదుర్కొంది.

మూడు కోట్లు ఇచ్చి సింగపూర్‌ కంపెనీలతో చేయించుకున్న ఆ డిజైన్‌ను చెత్తబుట్టలో వేసేశారు. తాజాగా మలేషియా వారితో మరో డిజైన్ గీయించారు. దాన్ని ఎప్పటిలాగానే బయటకు వదిలారు. ఈ డిజైన్‌ను ఆర్డీఏ హ్యారీస్ ఇండియా కంపెనీ రూపొందించింది. ఈ డిజైన్‌కు ఎన్నికోట్లు సమర్పించింది మాత్రం ప్రభుత్వం బయటకు చెప్పడం లేదు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News