బాబు వల్లే కష్టాలు... వైఎస్‌ పోరాడి సీఎం అయ్యారు

హైకోర్టు విభజన విషయంలో చంద్రబాబు వైఖరిని టీఆర్‌ఎస్ రాజ్యసభ ఎంపీ డీఎస్ తప్పుపట్టారు. చంద్రబాబు వల్లే తెలుగు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు. పరిపాలనను అమరావతికి తరలించేందుకు శరవేగంగా ప్రయత్నిస్తున్నచంద్రబాబు హైకోర్టు విభజనకు మాత్రం ఎందుకు అంగీకరించడం లేదని ప్రశ్నించారు. హైకోర్టును ఏపీలో పెడితే అక్కడి ప్రజలకు కూడా మంచి జరుగుతుంది కదా అని ప్రశ్నించారు. హైకోర్టు విభజనను అడ్డుకుంటున్నది చంద్రబాబేనని స్వయంగా సదానందగౌడే చెప్పారన్నారు. అలా అన్నందుకే బీజేపీ నేతలతోకలిసి సదానంద గౌడ్ శాఖను మార్పించివేశారని డీఎస్ […]

Advertisement
Update:2016-07-24 15:48 IST

హైకోర్టు విభజన విషయంలో చంద్రబాబు వైఖరిని టీఆర్‌ఎస్ రాజ్యసభ ఎంపీ డీఎస్ తప్పుపట్టారు. చంద్రబాబు వల్లే తెలుగు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు. పరిపాలనను అమరావతికి తరలించేందుకు శరవేగంగా ప్రయత్నిస్తున్నచంద్రబాబు హైకోర్టు విభజనకు మాత్రం ఎందుకు అంగీకరించడం లేదని ప్రశ్నించారు. హైకోర్టును ఏపీలో పెడితే అక్కడి ప్రజలకు కూడా మంచి జరుగుతుంది కదా అని ప్రశ్నించారు. హైకోర్టు విభజనను అడ్డుకుంటున్నది చంద్రబాబేనని స్వయంగా సదానందగౌడే చెప్పారన్నారు. అలా అన్నందుకే బీజేపీ నేతలతోకలిసి సదానంద గౌడ్ శాఖను మార్పించివేశారని డీఎస్ ఆరోపించారు. తొమ్మిదేళ్ల పాటు తెలంగాణ ప్రాంతాన్ని కూడా పరిపాలించిన చంద్రబాబు ఇక్కడి ప్రజల విషయంలో ఇలా వ్యవహరించడం సరికాదన్నారు.

కొందరు కాంగ్రెస్‌ నేతలు తనను కావాలని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారని డీఎస్ చెప్పారు. అందుకే పార్టీ మారాల్సి వచ్చిందన్నారు. వైఎస్‌ కాంగ్రెస్ పార్టీలో 25ఏళ్ల పాటు కష్టాలుపడి, పోరాడి సీఎం అయ్యారన్నారు. కానీ సీఎం అయిన ఐదేళ్లకే చనిపోవడం దురదృష్టకరమన్నారు. వైఎస్‌ చనిపోయిన సమయంలో తాను ఎమ్మెల్యేగా లేనని అందుకే సీఎం పదవి దక్కలేదన్నారు. ఆ విషయంలో తనకు ఎలాంటి బాధలేదన్నారు. పార్టీ ఫిరాయింపులన్నవి తెలంగాణకు మాత్రమే పరిమితంకాదన్నారు. దేశం మొత్తం మీద రాజకీయ వాతావరణం మారిపోయిందన్నారు. కేసీఆర్‌ చేసే ప్రతికార్యక్రమాన్ని ప్రతిపక్షాలు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని, అది నచ్చకే చాలా మంది ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లోకి వస్తున్నారని చెప్పారు. అభివృద్ధిలో పాలుపంచుకునేందుకు వస్తున్న వారిని వద్దని ఎలా చెప్పగలమని ప్రశ్నించారు.

Click on Image to Read:

 

 

 

 

 

 

 

Tags:    
Advertisement

Similar News