మా దయతోనే తెలంగాణ అభివృద్ధి
బీజేపీ నేతలు పాత పాటనే మళ్లీ పాడారు. గతంలో ఇదే పాట పాడిన ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు దారుణంగా భంగపడ్డారు.. అయినా నవ్విపోదురు గాక.. నాకేంటి.. అన్న చందంగా ఉంది బీజేపీ నేతల తీరు. తెలంగాణలో చేపట్టిన ప్రతి అభివృద్ధి పని కేంద్రం దయతోనే విజయవంతమవుతోందని బీజేపీ నేతలు మరోసారి అదే రాగాన్ని అందుకున్నారు. అస్సలు తెలంగాణకు తమ ప్రభుత్వం నిధులు ఇవ్వకుంటే.. నా సామిరంగా.. ఇంత అభివృద్ధి సాధ్యమయ్యేదా? అని గొప్పలకు పోయారు. ప్రతి సంక్షేమ […]
Advertisement
బీజేపీ నేతలు పాత పాటనే మళ్లీ పాడారు. గతంలో ఇదే పాట పాడిన ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు దారుణంగా భంగపడ్డారు.. అయినా నవ్విపోదురు గాక.. నాకేంటి.. అన్న చందంగా ఉంది బీజేపీ నేతల తీరు. తెలంగాణలో చేపట్టిన ప్రతి అభివృద్ధి పని కేంద్రం దయతోనే విజయవంతమవుతోందని బీజేపీ నేతలు మరోసారి అదే రాగాన్ని అందుకున్నారు. అస్సలు తెలంగాణకు తమ ప్రభుత్వం నిధులు ఇవ్వకుంటే.. నా సామిరంగా.. ఇంత అభివృద్ధి సాధ్యమయ్యేదా? అని గొప్పలకు పోయారు. ప్రతి సంక్షేమ పథకం వెనక మేం ఉదారంగా జారీ చేసిన నిధులు ఉన్నాయి కాబట్టే ఇంతటి అభివృద్ధి సాధ్యమైంది తెలుసా? అని గుర్తు చేశారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఆలస్యంగా కళ్లు తెరిచి, ఇప్పటికైనా తెలంగాణకు ప్రధానిని ఆహ్వానించారని అన్నారు. అస్సలు తెలంగాణను అభివృద్ధి చెందుతున్నదే బీజేపీ దయవల్ల అని తేల్చిపారేశారు.
బీజేపీ నేతలు.. కేంద్రమంత్రి దత్తాత్రేయ, ఎమ్మెల్యేలు లక్ష్మణ్, ప్రభాకర్ తదితరులు ఈ ఆరోపణలు చేశారు. తెలంగాణలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి పని తమ చలవేనని స్పష్టం చేశారు. వారికి తెలంగాణవాదులు, తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు కొన్ని సూటి ప్రశ్నలు సంధిస్తున్నారు.
అవేంటంటే..?
1. బీజేపీ తెలంగాణకు ఉదారంగా నిధులు ఇస్తుందా? తెలంగాణ ఇండియాలోనే ఉందా? లేక విదేశాల్లో ఉందా?
2. కేంద్రానికి తెలంగాణ అస్సలు పన్నులు చెల్లించడం లేదా? ఇక్కడి పౌరులు అస్సలు పన్నులు కట్టడం లేదా? తెలంగాణ కోసం కేంద్ర పరిధిలో ఉన్న సర్వీసులను ఏమైనా ఉచితంగా నడుపుతున్నారా?
3. మేం కడుతున్న పన్నుల్లో మాకు రావాల్సిన నిధుల్నే ఇస్తున్నారు కదా? వాటిని కేంద్రంలోని బీజేపీ మంత్రులు తమ జేబుల నుంచి ఇవ్వడం లేదన్న సంగతి తెలుసా? కనీసం మిగిలిన రాష్ర్టాల కంటే ఎంత ఎక్కువ ఇచ్చారో చెప్పగలరా?
4. మొన్నటికి మొన్న తెలంగాణకు రూ.90 వేల కోట్లు ఇచ్చామని సూర్యాపేట సభలో చెప్పిన అమిత్‌షా వాటిని ఎందుకు నిరూపించలేదు. అవి అబద్దాలని తెలంగాణ ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ ప్రతిఆరోపణపై ఎందుకు స్పందించడలేదు?
5. తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చాలని చూసిన నిందితులకు అసెంబ్లీలో బీజేపీ నేతలు స్వాగతం చెప్పడాన్ని ఏమనుకోవాలి?
6. ముందు మీరు తెలంగాణకు శనిలా దాపురించిన టీడీపీ దయలేకుండా గెలిచి చూపించండి. ప్రధాని దేశానికి మొత్తం ప్రధానే.. నిధుల విషయంలో తెలంగాణకు మీరేం బిచ్చం వేయడం లేదు. ఆ విషయం తెలుసా?
7. విభజన సమస్యలు నెరవేర్చకుండా.. ఏపీ పెడుతున్న కిరికిరీలకు మద్దతు తెలుపుతున్న మీకు ఈ ప్రాంతం అభివృద్ధిపై మాట్లాడే హక్కు ఉందా? అని ప్రశ్నిస్తున్నారు.
Advertisement