చిల్లర దక్కదనే ఆరాటం... సైనెడ్ కావాలనే కలిపారు
ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక అర్హత కేంద్రమంత్రి సుజనా చౌదరి, ఎంపీ సీఎం రమేష్ లకు లేదని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి విమర్శించారు. బీజేపీ, టీడీపీ కలిసి కుట్రపన్ని ప్రత్యేకహోదా బిల్లును అడ్డుకున్నాయని ఆరోపించారు. ప్రత్యేక హోదా వస్తే తమకు చిల్లర దొరకదనే ప్రత్యేక ప్యాకేజీకి టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారని విమర్శించారు. ప్రైవేట్ బిల్లుకు చట్టబద్దత ఉంటుందా అంటూ సీఎం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. విజయవాడ కల్తీ మద్యం కేసులో కాంగ్రెస్ […]
ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక అర్హత కేంద్రమంత్రి సుజనా చౌదరి, ఎంపీ సీఎం రమేష్ లకు లేదని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి విమర్శించారు. బీజేపీ, టీడీపీ కలిసి కుట్రపన్ని ప్రత్యేకహోదా బిల్లును అడ్డుకున్నాయని ఆరోపించారు. ప్రత్యేక హోదా వస్తే తమకు చిల్లర దొరకదనే ప్రత్యేక ప్యాకేజీకి టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారని విమర్శించారు. ప్రైవేట్ బిల్లుకు చట్టబద్దత ఉంటుందా అంటూ సీఎం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. విజయవాడ కల్తీ మద్యం కేసులో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు ఎలాంటి సంబంధం లేదన్నారు రఘువీరారెడ్డి. కొందరు వ్యక్తుల కావాలనే బార్‌లోని నీటిలో సైనెడ్ కలిపారని …ఈ విషయం దర్యాప్తులో కూడా రుజువైందన్నారు. మల్లాది విష్ణుపై కక్ష సాధించేందుకే కొందరు ఈ పని చేశారని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే మల్లాది విష్ణుపై చంద్రబాబు ప్రభుత్వం కక్షసాధిస్తోందన్నారు రఘువీరారెడ్డి.
Click on Image to Read: