రూ. 6000 కోట్లున్నా పనివాడిగా ఉద్యోగం

కొందరు తాము పడ్డ కష్టాలు తమ పిల్లలు పడకూడదంటూ కోట్లు సంపాదించి వారికి ఇస్తుంటారు. అలా చేయడం వల్ల పిల్లలకు కష్టనష్టాల గురించి తెలియదు. డబ్బు విలువ, శ్రమ విలువ కూడా ఆ తరహా వారసత్వ శ్రీమంతులకు అర్థం కాదు. మరికొందరు తండ్రులు ఉంటారు. సంపాదించిన ఆస్తులు వారసత్వం ఇవ్వడం కంటే తొలుత వారిని మనిషిగా చూడాలనుకుంటున్నారు. ఇలాంటి తండ్రులు అరుదుగానే ఉంటారు. అలాంటి అరుదైన వ్యక్తుల్లో ఒకడే గుజరాత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి శావ్జీ దోలాకియా. […]

Advertisement
Update:2016-07-23 11:28 IST

కొందరు తాము పడ్డ కష్టాలు తమ పిల్లలు పడకూడదంటూ కోట్లు సంపాదించి వారికి ఇస్తుంటారు. అలా చేయడం వల్ల పిల్లలకు కష్టనష్టాల గురించి తెలియదు. డబ్బు విలువ, శ్రమ విలువ కూడా ఆ తరహా వారసత్వ శ్రీమంతులకు అర్థం కాదు. మరికొందరు తండ్రులు ఉంటారు. సంపాదించిన ఆస్తులు వారసత్వం ఇవ్వడం కంటే తొలుత వారిని మనిషిగా చూడాలనుకుంటున్నారు. ఇలాంటి తండ్రులు అరుదుగానే ఉంటారు. అలాంటి అరుదైన వ్యక్తుల్లో ఒకడే గుజరాత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి శావ్జీ దోలాకియా. ఈయన ఆస్తుల విలువ రూ. 6000 కోట్లు. ఉన్న ఒక కొడుకుకి నేరుగా ఆస్తులు బదలాయించలేదు. రజనీకాంత్‌ అరుణాచలం సినిమా తరహాలోనే కొడుక్కు ఒక పరీక్ష పెట్టారు. అరుణాచలం సినిమాలో రజనీకాంత్ తండ్రి 30కోట్లు ఇచ్చి 30రోజుల్లో దానాలు చేయకుండా ఆస్తులు కొనకుండా ఖర్చు చేయాల్సిందిగా పరీక్ష పెడుతాడు. అలాగే బిచ్చగాడు సినిమాలో హీరో ఓ పెద్ద సంస్థకు యజమాని. విదేశాల్లో చదువుకుని వచ్చాడు. తల్లికోసం నెలరోజుల పాటు తానెవరో చెప్పకుండా బిచ్చగాడుగా జీవనం సాగిస్తాడు. ఈ రెండింటి మిశ్రమమే ఒక వజ్రాల వ్యాపారి కుమారుడి జీవితం .

ద్రావ్య దోలాకియా

గుజరాత్ వజ్రాల వ్యాపారి .. ఎంబీఏ పూర్తి చేసుకుని అమెరికా నుంచి తిరిగివచ్చిన 21 ఏళ్ల తన కుమారుడు ద్రావ్య దోలాకియా చేతిలో 7వేలు, మూడు జతల బట్టలు పెట్టి కొన్ని కండిషన్లు పెట్టి బయటకు పంపించాడు. ప్రతి పైసా కష్టపడే సంపాందించాలి. ఎక్కడా తండ్రి పేరు చెప్పుకోకూడదు, మొబైల్ వాడకూడదు. వారం మించి ఒకే చోట పనిచేయకూడదు. కొత్త ఉద్యోగాన్ని ఆ వారంలోనే సంపాదించాలి. చేతికి ఇచ్చిన ఏడు వేలు కూడా అవసరమైతేనే ఖర్చు పెట్టాలి. ఇలాంటి కండిషన్లు పెట్టి కొడుకును బయటకు పంపించాడు. తండ్రి ఆదేశంతో అలా బయటకు వెళ్లిన ద్రావ్య విజయవంతంగా తిరిగి వచ్చాడు. తొలుత 5 రోజుల పాటు ద్రావ్యకు ఎక్కడా ఉద్యోగం దొరకలేదు, ఆ తర్వాత ఒక బేకరిలో పనిచేశాడు, అక్కడి నుంచి కాల్‌సెంటర్, చెప్పుల షాపు, మెక్‌ డొనాల్ట్స్‌ కంపెనీలో పనిచేశారు. అలా కొంత మొత్తం సంపాదించాడు. కొడుకు ఏం చేస్తున్నాడన్న దానిపై ఒక కన్నేసి ఉంచిన తండ్రి శావ్జీ… చివరకు తన కుమారుడు తాను పెట్టిన పరీక్షలో విజయం సాధించారని గుర్తించారు.

ద్రావ్య దోలాకియా

అనంతరం శావ్జీకి చెందిన హరేకృష్ణ డైమండ్ కంపెనీ ప్రతినిధులు… ద్రావ్యకు ఉద్యోగం ఇచ్చిన వారికి ఫోన్ చేసి అసలు విషయం కూడా వివరించారు. కష్టపడి ఇంటికి తిరిగి వచ్చిన కుమారుడిని చూసిన తర్వాత తనకు ఎంతో సంతోషంగా ఉందని శావ్జీ చెబుతున్నారు. తన కొడుక్కి కష్టం విలువ, నిరుద్యోగం విలువ తెలియజేయాలన్న ఉద్దేశంతోనే తానీ పరీక్ష పెట్టినట్టు చెప్పారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News