పచ్చిపక్షపాతం " భూమిరెడ్డికి ఒక న్యాయం, పరిటాల వారికి ఒక న్యాయం

అనంతపురం జిల్లాలో శాంతిభద్రతల విషయంలోనూ ప్రభుత్వం పక్షపాతాన్ని వీడడం లేదు. హత్యల విషయంలోనూ రాజకీయాలు చేస్తోంది. కొన్ని నెలల క్రితం అనంతపురం జిల్లా రాప్తాడుకు చెందిన కీలక నేత భూమిరెడ్డి ప్రసాద్‌ రెడ్డిని మండల తహసీల్దార్‌ కార్యాలయంలోనే దారుణంగా టీడీపీ వర్గీయులు నరికిచంపారు. ఈ హత్య చేయించింది పరిటాల కుటుంబమేనని అప్పట్లో పెద్దెత్తున ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వ కార్యాలయానికి పిలిచి మరీ హత్య చేయడంతో పెద్దెత్తున విమర్శలు వచ్చాయి. స్థానిక ఎస్‌ఐ స్వయంగా ఈ హత్యకు సహకరించారని ఆరోపణలు […]

Advertisement
Update:2016-07-23 16:46 IST

అనంతపురం జిల్లాలో శాంతిభద్రతల విషయంలోనూ ప్రభుత్వం పక్షపాతాన్ని వీడడం లేదు. హత్యల విషయంలోనూ రాజకీయాలు చేస్తోంది. కొన్ని నెలల క్రితం అనంతపురం జిల్లా రాప్తాడుకు చెందిన కీలక నేత భూమిరెడ్డి ప్రసాద్‌ రెడ్డిని మండల తహసీల్దార్‌ కార్యాలయంలోనే దారుణంగా టీడీపీ వర్గీయులు నరికిచంపారు. ఈ హత్య చేయించింది పరిటాల కుటుంబమేనని అప్పట్లో పెద్దెత్తున ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వ కార్యాలయానికి పిలిచి మరీ హత్య చేయడంతో పెద్దెత్తున విమర్శలు వచ్చాయి. స్థానిక ఎస్‌ఐ స్వయంగా ఈ హత్యకు సహకరించారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఒత్తిడికి గురైన ఉన్నతాధికారులు స్థానిక ఎస్‌ఐను బదిలీ చేశారు. దీంతో వెంటనే మంత్రి పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎస్‌ఐను ఎలా బదిలీ చేస్తారంటూ నిరసనగా గన్‌మెన్లను కూడా వెనక్కు పంపారు. దీంతో పోలీస్ డిపార్ట్‌మెంట్ దిగి వచ్చి స్థానిక పోలీసుల బదిలీలను నిలిపివేసింది. సీన్ అక్కడ కట్ చేస్తే…

రెండు రోజుల క్రితం అనంతపురం నగర శివారులోని చంద్రబాబు కొట్టాల్లో పరిటాల కుటుంబ అనుచరులైన రౌడీ షీటర్లు గోపినాయక్‌, వెంకటేష్ నాయక్‌ దారుణహత్యకు గురయ్యారు. ఈ హత్య వెనుక టీడీపీ అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి హస్తముందని పరిటాలవర్గం ఆరోపణ. అయితే ఏదో ఒకటి చేయాలన్న ఆగ్రహంతో పరిటాల వర్గం అనంతపురం ఫోర్త్ టౌన్ సీఐ సాయిప్రసాద్, ఎస్ఐ హేమంత్‌లపై కన్నెర్రచేశారు. వారిద్దరినీ సస్పెండ్‌ చేయించారు. అయితే సీఐ, ఎస్‌ఐ సస్పెన్షన్ వెనుక పరిటాల సునీత ఒత్తిడి ఉందని మరో వర్గం ఆరోపణ.

వైసీపీ నేత భూమిరెడ్డి ప్రసాద్ రెడ్డిని తహసీల్దార్‌ కార్యాలయానికి పిలిపించి అక్కడే గదిలో దారుణంగా హత్య చేసినప్పుడు ఎవరిపైనా చర్యలు లేవు. స్థానిక ఎస్‌ఐ స్వయంగా భూమిరెడ్డి హత్యకు సహకరించారన్న విమర్శలు రావడంతో వారిని కేవలం బదిలీ చేస్తేనే పరిటాల సునీత రగలిపోయారు. మరి తమ అనుచరులు హత్యకు గురయ్యే సరికి మాత్రం పోలీసుల ఉద్యోగాలకు ఎసరొచ్చింది. అదీ బాబుగారి పాలనలో నెత్తుటికి నెత్తుటికి మధ్య ఉన్న తేడా.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News