అశుభం మాటల్లోనే అర్థమైపోలా..!
ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లు టీడీపీని బాగానే ఇబ్బంది పెట్టింది. బిల్లుకు మద్దతు ఇవ్వాలా వద్దా అని తర్జనభర్జన పడ్డ టీడీపీ చివరకు తప్పనిసరి పరిస్థితిలో బిల్లుకు మద్దతిస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఆపార్టీ ఎంపీలు ఢిల్లీలో ప్రెస్‌మీట్ పెట్టి ఈ విషయం చెప్పారు. అయితే మద్దతిస్తామంటూనే ఎంపీ సీఎం రమేష్… ప్రైవేట్ బిల్లును హేళన చేశారు. బిల్లు చర్చకు వచ్చినప్పుడు రాజ్యసభలో ఎంతమంది కాంగ్రెస్ ఎంపీలు ఉంటారో చూద్దామంటూ […]
ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లు టీడీపీని బాగానే ఇబ్బంది పెట్టింది. బిల్లుకు మద్దతు ఇవ్వాలా వద్దా అని తర్జనభర్జన పడ్డ టీడీపీ చివరకు తప్పనిసరి పరిస్థితిలో బిల్లుకు మద్దతిస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఆపార్టీ ఎంపీలు ఢిల్లీలో ప్రెస్‌మీట్ పెట్టి ఈ విషయం చెప్పారు. అయితే మద్దతిస్తామంటూనే ఎంపీ సీఎం రమేష్… ప్రైవేట్ బిల్లును హేళన చేశారు. బిల్లు చర్చకు వచ్చినప్పుడు రాజ్యసభలో ఎంతమంది కాంగ్రెస్ ఎంపీలు ఉంటారో చూద్దామంటూ రుసరుసలాడారు.
అసలు ఈ ప్రైవేట్ బిల్లుల వల్ల ఏం ఉపయోగం ఉంటుందని సీఎం రమేష్ ప్రశ్నించారు. ప్రైవేట్ బిల్లు వల్ల మంచి జరిగినట్టు భారత దేశ చరిత్రలోనే లేదని వ్యాఖ్యానించారు. ఇదంతా కాంగ్రెస్ ఆడుతున్న నాటకం అంటూ బిల్లు రావడానికి ముందే దాని తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేశారు. చంపేసి సంతాప సభ పెట్టినట్టుగా ఉందన్నారు. అయితే ప్రైవేట్ బిల్లును కేవీపీ ప్రవేశపెడుతున్నప్పటికీ టీడీపీ ఎంపీలు ఎక్కడా కూడా ఆయన పేరు ఎత్తలేదు. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డే బిల్లు పెడుతున్నారన్నట్టుగా సీఎం రమేష్ ఆయనపై విరుచుకుపడ్డారు. అయినా ప్రైవేట్ బిల్లు వల్ల ప్రత్యేక హోదా వస్తుందా రాదా అన్నది తర్వాతి అంశం. కనీసం దాని వల్ల ప్రత్యేక హోదా డిమాండ్‌ను మరోసారి వినిపించే అవకాశం వస్తుంది. దాన్ని కూడా టీడీపీ ఎంపీలు ఎద్దేవా చేయడం బట్టే ఆ పార్టీ కమిట్‌మెంట్‌పై విమర్శలు వచ్చే అవకాశం ఉంది.
Click on Image to Read: