కావాలని మేం అడిగామా? ఈ తరహా రాజకీయం శాశ్వతమైనది కాదు

అసెంబ్లీలో సీట్ల సంఖ్య ఆధారంగా టీడీపీకి రాజధానిలో నాలుగు ఎకరాలు, జిల్లా కేంద్రాల్లో రెండు ఎకరాల చొప్పున చంద్రబాబు  కేటాయించుకోవడాన్ని వైసీపీ నేత బొత్ససత్యనారాయణ తీవ్రంగా తప్పుపట్టారు. ఈ దేశంలో ఏ పార్టీ కార్యాలయం అయినా నాలుగు ఎకరాల్లో ఉందా అని ప్రశ్నించారు. జిల్లా కేంద్రాల్లో టీడీపీ కార్యాలయం కోసం రెండేసి ఎకరాల చొప్పున తీసుకోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. చంద్రబాబు దోపిడి విధానానికి ఇది మరో నిదర్శనమన్నారు. టీడీపీ కార్యాలయం కోసం రాజధానిలో నాలుగు ఎకరాలు కేటాయించుకుని […]

Advertisement
Update:2016-07-22 15:21 IST

అసెంబ్లీలో సీట్ల సంఖ్య ఆధారంగా టీడీపీకి రాజధానిలో నాలుగు ఎకరాలు, జిల్లా కేంద్రాల్లో రెండు ఎకరాల చొప్పున చంద్రబాబు కేటాయించుకోవడాన్ని వైసీపీ నేత బొత్ససత్యనారాయణ తీవ్రంగా తప్పుపట్టారు. ఈ దేశంలో ఏ పార్టీ కార్యాలయం అయినా నాలుగు ఎకరాల్లో ఉందా అని ప్రశ్నించారు. జిల్లా కేంద్రాల్లో టీడీపీ కార్యాలయం కోసం రెండేసి ఎకరాల చొప్పున తీసుకోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. చంద్రబాబు దోపిడి విధానానికి ఇది మరో నిదర్శనమన్నారు.

టీడీపీ కార్యాలయం కోసం రాజధానిలో నాలుగు ఎకరాలు కేటాయించుకుని వైసీపీకి అర ఎకరం కేటాయించడంపై బొత్సను ప్రశ్నించగా.. అసలు భూమి కావాలని తాము అడిగామా అని ప్రశ్నించారు. ఇలాంటి దోపిడిలో తాము భాగస్వాములం కాబోమన్నారు. దేశ చరిత్రలోనే సీట్ల ఆధారంగా పార్టీ కార్యాలయాలకు భూములు కేటాయించిన ఉదంతం లేదన్నారు. జిల్లా కేంద్రాల్లో విలువైన భూములను కొల్లగొట్టేందుకు చంద్రబాబు ఈ ఎత్తు వేశారని బొత్స ఆరోపించారు. సీట్ల ప్రతిపదికనే అయితే ఇప్పుడు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్‌ భవన్‌ను ప్రభుత్వానికి తిరిగి అప్పగిస్తారా అని ప్రశ్నించారు.

అధికారం ఇదే ఆఖరి సారి అన్న భావన కలిగినప్పుడే ఇలాంటి దోపిడికి ప్రభుత్వాలు తెగబడుతాయన్నారు. శాశ్వతంగా రాజకీయాలు చేయాలనుకునే పార్టీ గాని, వ్యక్తులు గాని ఇలాంటి రాజకీయాలను చేయరన్నారు. చంద్రబాబు భూదాహం దెబ్బకు తమ ఇల్లు, భూమి ఉంటుందో పోతుందోనని గ్రామీణజనం భయపడుతూ బతుకుతున్నారని బొత్స సత్యనారాయణ అన్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News