చంద్రబాబు తలుచుకుంటే అక్కదో కులం, తమ్ముడిదో కులం

కొత్తపల్లి గీత, వివేక్‌. ఇద్దరూ ఒకే తల్లి బిడ్డలు.  వీరు ఎస్టీలు కాదంటూ 2004లో వివాదం చెలరేగింది. దీన్ని పరిష్కరించేందుకు జిల్లా స్థాయిలో జాయింట్‌ కలెక్టర్, గిరిజన , సాంఘిక, బీసీ సంక్షేమ శాఖల అధికారులు, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్పీతో కూడిన స్క్రూటినీ కమిటీని నియమించి విచారణ జరిపించారు. కొద్ది రోజుల క్రితమే వివేక్‌ను ఎస్టీ కాదని ఈకమిటీ తేల్చింది. దీంతో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ హెచ్‌ అరుణ్‌కుమార్ ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఒకే తల్లి కడుపున […]

Advertisement
Update:2016-07-22 15:12 IST

కొత్తపల్లి గీత, వివేక్‌. ఇద్దరూ ఒకే తల్లి బిడ్డలు. వీరు ఎస్టీలు కాదంటూ 2004లో వివాదం చెలరేగింది. దీన్ని పరిష్కరించేందుకు జిల్లా స్థాయిలో జాయింట్‌ కలెక్టర్, గిరిజన , సాంఘిక, బీసీ సంక్షేమ శాఖల అధికారులు, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్పీతో కూడిన స్క్రూటినీ కమిటీని నియమించి విచారణ జరిపించారు. కొద్ది రోజుల క్రితమే వివేక్‌ను ఎస్టీ కాదని ఈకమిటీ తేల్చింది. దీంతో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ హెచ్‌ అరుణ్‌కుమార్ ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఒకే తల్లి కడుపున పుట్టిన వివేక్‌ ఎస్టీ కాదని తేలడంతో ఇక కొత్తపల్లి గీత కూడా ఎస్టీ కాదని నిర్ధారణ అయినట్టే. ఆమె ఎంపీ పదవికి ఎసరొచ్చినట్టేనని అందరూ భావించారు. కానీ ఇది చంద్రబాబు రాజ్యం కదా!. ఒకే తల్లి కడుపున పుట్టిన వారిని కూడా వేర్వేరు కులాలను అంటకట్టే సామర్ధ్యం ఉన్న పాలన.

గీత సోదరుడిని ఎస్టీ కాదని నిర్దారించిన అదే కమిటీ ఇప్పుడు కొత్తపల్లి గీత ఎస్టీ అంటూ విచిత్రంగా తేల్చింది. కమిటీ తేల్చడమే ఆలస్యం, అదే కలెక్టర్‌ ప్రొసీడింగ్స్ కూడా జారీ చేశారు. ఓకే కడుపున పుట్టిన వారు ఒకరు ఒక కులానికి మరొకరు ఇంకోకులానికి ఎలా చెందుతారని విచారణ కమిటీని కలెక్టర్‌ కూడా ప్రశ్నించలేదు. విచారణ కమిటీ, కలెక్టర్‌ ఇచ్చిన ఆదేశాలు చూసి కంగుతినడం గిరిజన సంఘాల వంతైంది. 1993లోనే అప్పటి జేసీ మంగపతిరాజు కొత్తపల్లి గీత, ఆమె తల్లిదండ్రులు, సోదరుడు ఎస్టీలు కాదని నిర్ధారించడం విశేషం. అయితే అధికారులు అరకు ఎంపీ కొత్తపల్లి గీతను ఎస్టీగా తేల్చడం వెనుక చంద్రబాబు ఒత్తిడి ఉందని చెబుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన కొత్తపల్లి గీత వెంటనే పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరిపోయారు. అందుకే ఆమెను చంద్రబాబు రక్షించారని ఇందుకోసం అన్ని గీతలు చెరిపివేసి అధికారులతో సర్టిఫికేట్ ఇప్పించారని చెబుతున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News