చిన్నారి పెళ్లి కూతురు బాయ్‌ఫ్రెండ్‌పై… వెయ్యిపేజీల ఛార్జిపీటు!
చిన్నారి పెళ్లికూతురు సీరియల్ నటి ప్రత్యూషా బెనర్జీ ఆత్మహత్య కేసులో ఆమె బాయ్‌ఫ్రెండ్ రాహుల్ రాజ్ సింగ్‌పై ముంబయి పోలీసులు 1000పేజీల ఛార్జిషీటుని కోర్టులో దాఖలు చేశారు. రాహుల్ రాజ్ ఆమెని వేధించాడని, హింసించాడని, ఆత్మహత్యకు ప్రేరేపించాడని అందులో పేర్కొన్నారు. బుధవారం ముంబయిలోని బోరివలి కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేసిన సమయంలో రాహల్ తన స్నేహితుడితో కలిసి కోర్టుకి హాజరయ్యాడు. అతను ప్రస్తుతం ముందస్తు బెయిల్ మీద బయటే ఉన్నాడు. అయితే ఈ నెల 30న కేసు […]
చిన్నారి పెళ్లికూతురు సీరియల్ నటి ప్రత్యూషా బెనర్జీ ఆత్మహత్య కేసులో ఆమె బాయ్‌ఫ్రెండ్ రాహుల్ రాజ్ సింగ్‌పై ముంబయి పోలీసులు 1000పేజీల ఛార్జిషీటుని కోర్టులో దాఖలు చేశారు. రాహుల్ రాజ్ ఆమెని వేధించాడని, హింసించాడని, ఆత్మహత్యకు ప్రేరేపించాడని అందులో పేర్కొన్నారు. బుధవారం ముంబయిలోని బోరివలి కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేసిన సమయంలో రాహల్ తన స్నేహితుడితో కలిసి కోర్టుకి హాజరయ్యాడు. అతను ప్రస్తుతం ముందస్తు బెయిల్ మీద బయటే ఉన్నాడు. అయితే ఈ నెల 30న కేసు విచారణకోసం అతను కోర్టుకి హాజరు కావాల్సిందిగా కోర్టు ఆదేశించింది.
ప్రత్యూష, రాహుల్‌ల టెలిఫోన్ సంభాషణల ఆడియో రికార్డులను ఆధారంగా చేసుకుని పోలీసులు ఎక్కువభాగం దర్యాప్తు చేశారు. సాక్ష్యుల మాటలను, బ్యాంక్ స్టేట్మెంట్లను, కాల్ డాటా రికార్డులను, ఫోరెన్సిక్ నివేదికలను, ఆసుపత్రి పేపర్లను సైతం ఛార్జిషీటులో పొందుపొరచారు. 45 మంది నుండి సాక్ష్యాలు సేకరించారు. రాహుల్ ప్రత్యూషపై చేతబడి చేసినట్టుగా ఆమె తల్లి పేర్కొంది. ప్రత్యూష గుర్గావ్లో తన ఫ్లాట్‌లో ఏప్రిల్ ఒకటిన ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.