కేటీఆర్‌కు అంత‌ర్జాతీయ గుర్తింపు... లోకేశ్‌పై జాలిప‌డుతున్న త‌మ్ముళ్లు!

ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వ‌చ్చిందంటే.. ఇదే..! తెలంగాణ సీఎం కేసీఆర్ కుమారుడు కేటీఆర్ ప్ర‌తిష్ట రోజురోజుకు పెరిగిపోతోంటే.. ఏపీ సీఎం కుమారుడి ప‌రిస్థితి ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డే అన్న చందంగా ఉంది. తెలుగు రాష్ర్టాల ముఖ్య‌మంత్రుల మ‌ధ్యే కాదు. వారి కుమారుల మ‌ధ్య కూడా అదేస్థాయిలో పోటీ ఉంది. కానీ, ఏ విష‌యంలోనూ కేటీఆర్‌కు  స‌మ ఉజ్జీగా లోకేశ్‌ నిల‌వ‌లేక‌పోతున్నాడు. ఈ విష‌యాన్ని చాలామంది తెలుగు త‌మ్ముళ్లే అంగీక‌రిస్తున్నారు. కానీ, కేటీఆర్ అంత‌ర్జాతీయ స్థాయిలో […]

Advertisement
Update:2016-07-19 02:57 IST
ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వ‌చ్చిందంటే.. ఇదే..! తెలంగాణ సీఎం కేసీఆర్ కుమారుడు కేటీఆర్ ప్ర‌తిష్ట రోజురోజుకు పెరిగిపోతోంటే.. ఏపీ సీఎం కుమారుడి ప‌రిస్థితి ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డే అన్న చందంగా ఉంది. తెలుగు రాష్ర్టాల ముఖ్య‌మంత్రుల మ‌ధ్యే కాదు. వారి కుమారుల మ‌ధ్య కూడా అదేస్థాయిలో పోటీ ఉంది. కానీ, ఏ విష‌యంలోనూ కేటీఆర్‌కు స‌మ ఉజ్జీగా లోకేశ్‌ నిల‌వ‌లేక‌పోతున్నాడు. ఈ విష‌యాన్ని చాలామంది తెలుగు త‌మ్ముళ్లే అంగీక‌రిస్తున్నారు. కానీ, కేటీఆర్ అంత‌ర్జాతీయ స్థాయిలో దూసుకుపోతోంటే.. అక్క‌డే ఉన్న‌ లోకేశ్ ను చూసి తెలుగు త‌మ్ముళ్లు జాలిప‌డుతున్నారు.
ఇంత‌కీ ఈ విష‌యం ఇప్పుడెందుకు ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చిందంటే.. తెలంగాణ మంత్రి కేటీఆర్ కు మ‌రో అరుదైన గుర్తింపు ల‌భించింది. అరుదైన అనే కంటే అంత‌ర్జాతీయ గుర్తింపు అంటే స‌మంజ‌సంగా ఉంటుంది. మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి విధాన రూప‌క‌ల్ప‌న‌పై శ్రీ‌లంక‌లో జ‌రిగే అంత‌ర్జాతీయ స‌ద‌స్సు(హ్యూమ‌న్ కేపిట‌ల్ స‌మిట్‌) లో ప్ర‌సంగించాల‌ని కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. వ‌చ్చేనెల 11, 12 తేదీల్లో కొలంబోలో జ‌రిగే ఈ స‌మిట్‌లో శ్రీ‌లంక అధ్య‌క్షుడు విక్ర‌మ‌సింఘే తో క‌లిసి కేటీఆర్‌ కీల‌కోపాన్యాసం చేస్తారు. టూరిజం, హాస్పిటాలిటీ, టెక్నాల‌జీ, ఫైనాన్సియ‌ల్‌, నిర్మాణం త‌దిత‌ర రంగాలపై ఈ స‌ద‌స్సులో చ‌ర్చిస్తారు.
మొన్న‌టికి మొన్న ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ తో చ‌ర్చ‌లు.. ఆ కంపెనీ హైదరాబాద్‌లో క్యాంప‌స్ ఏర్పాటు చేసేందుకు ముందుకు రావ‌డం త‌దిత‌ర కీల‌క విష‌యాల్లో త‌న‌మార్కు చూపెట్టారు కేటీఆర్‌. తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌, ఉర్దూ భాష‌ల్లో అన‌ర్గ‌ళంగా మాట్లాడుతూ రోజురోజుకు త‌న ప్ర‌తిష్ట‌ను పెంచుకుంటున్నాడు. లోకేశ్ మాత్రం ఇంకా తండ్రిచాటు బిడ్డ‌గానే ఉండ‌టం తెలుగు త‌మ్ముళ్ల‌కు రుచించ‌డం లేదు. ప్ర‌పంచంలో ప్ర‌తీది త‌న చ‌ల‌వే అని చెప్పుకునే చంద్ర‌బాబు.. త‌న‌కుమారుడికి ఏదో ఒక‌టి చెప్పొచ్చు క‌దా! అని అనుకుంటున్నారు తెలుగు త‌మ్ముళ్లు. మ‌రి లోకేశ్ ఎప్పుడు అంత‌ర్జాతీయ‌స్థాయికి ఎదుగుతారోన‌ని ఆశ‌గా ఎదురుచూస్తున్నారు. పాపం! వారి కోరిక ఎప్ప‌టికి నెర‌వేరుతుందో..!

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News