"ఒరేయ్‌ దరిద్రుడా... ఎంత తింటావురా?"- శివాజీ ఫైర్

కొద్దికాలంగా సైలెంట్‌గా ఉన్న నటుడు శివాజీ మరోసారి బయటకొచ్చారు. ప్రత్యేకహోదాపై చంద్రబాబు, వెంకయ్యనాయుడుకు వార్నింగ్ ఇచ్చారు. ప్రత్యేకహోదా విషయంలో రాజీపడితే చంద్రబాబు ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. అలా చేసి చరిత్రలో నిలిచిపోతానని చెప్పారు. చంద్రబాబు భావితరాల ఉసురు తగులుతుందని శాపనార్థాలు పెట్టారు. రాష్ట్ర విభజనలో లేఖ ఇచ్చిన టీడీపీ పాపం కూడా ఉందన్నారు. మూడేళ్లు గడుస్తున్నా సిగ్గు లేకుంటా టీడీపీ నేతలు మౌనంగా ఉన్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలు చేస్తున్నది పక్కా రాజకీయ వ్యాపారం […]

Advertisement
Update:2016-07-19 09:38 IST

కొద్దికాలంగా సైలెంట్‌గా ఉన్న నటుడు శివాజీ మరోసారి బయటకొచ్చారు. ప్రత్యేకహోదాపై చంద్రబాబు, వెంకయ్యనాయుడుకు వార్నింగ్ ఇచ్చారు. ప్రత్యేకహోదా విషయంలో రాజీపడితే చంద్రబాబు ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. అలా చేసి చరిత్రలో నిలిచిపోతానని చెప్పారు. చంద్రబాబు భావితరాల ఉసురు తగులుతుందని శాపనార్థాలు పెట్టారు. రాష్ట్ర విభజనలో లేఖ ఇచ్చిన టీడీపీ పాపం కూడా ఉందన్నారు. మూడేళ్లు గడుస్తున్నా సిగ్గు లేకుంటా టీడీపీ నేతలు మౌనంగా ఉన్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలు చేస్తున్నది పక్కా రాజకీయ వ్యాపారం అని విమర్శించారు. ప్రత్యేక హోదా ప్రైవేట్ బిల్లు చర్చకు కూడా రాకుండా అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నారని అన్నారు.

వంద విమానాలేసుకుని వంద దేశాలు తిరిగినా ఒక్క పెట్టుబడి కూడా రాదని చంద్రబాబుకు శివాజీ హితవు పలికారు. ప్రత్యేక హోదా వస్తే ప్రపంచమే ఇక్కడికి వస్తుందన్నారు. ”సర్‌ చెబుతున్నా వినండి. మీరు ప్రత్యేకహోదాను వదిలేసి ప్యాకేజీలకు పాల్పడితే డైరెక్ట్ గా మీ ఇంటి ముందే ఆత్మహత్య చేసుకుంటా, తమాషాగా ఉందా? ఏపీతో ఆడుకుంటారా? రైతులు 33 వేల ఎకరాలు ఇస్తే మీరంతా కలిసి పంచుకుంటారా?” అని చంద్రబాబుపై శివాజీ మండిపడ్డారు. వెంకయ్యనాయుడు చేతికి సమాచారశాఖ కూడా వచ్చిందని ఇక ఆయన విషపడగ ఎలా పనిచేస్తుందో ప్రపంచం చూస్తుందన్నారు.

కులాలను రెచ్చుగొడుతూ పబ్బం గడుపుకుంటున్నారని శివాజీ విమర్శించారు. ప్రభుత్వం నడుపుతూ ఆ ముసుగులో కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారు. అద్దం ముందు నిలబడినప్పుడు “ఒరేయ్ దరిద్రుడా ఎంత తింటావురా అని మీ అంతరాత్మ ప్రశ్నించడం లేదా” అని శివాజీ చంద్రబాబును నిలదీశారు. సంపాదించుకోవాలంటే వ్యాపారం చేసుకోండని హితవు పలికారు. సినీ పరిశ్రమను ఓ నలుగురి కోసం ఎక్కడ పెట్టాలని చర్చిస్తున్నారని అన్నారు. కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా సినీ పరిశ్రమ రాజధానిలో ఉండాలన్న విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు.

చంద్రబాబు రాజధాని పేరుతో టైమ్‌ పాస్ చేస్తున్నారని విమర్శించారు. పైన దేవుడున్నాడు. ప్రకృతిని శాసిద్దామనుకుంటే పొరపాటేనని అన్నారు. ఈనెల 22న కేవీపీ పెట్టిన బిల్లుకు ప్రతి ఒక్కరూ ఓటు వేసి తీరాల్సిందే.. లేకుంటే ప్రజలే తేలుస్తారని శివాజీ హెచ్చరించారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News