జేవీ రాముడు పోటీ చేసేది అక్కడేనా?

డీజీపీ జేవీ రాముడు ఈ నెలాఖరుకు రిటైర్ అవుతున్నారు. ఆయన స్థానంలో ఆర్టీసీ ఎండీ నండూరి సాంబశివరావును నియమించేందుకు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అయితే రిటైర్ అయిన తర్వాత డీజీపీ జేవీరాముడు రాజకీయాల వైపు అడుగులేస్తారని చెబుతున్నారు. ఇందుకోసం చాలాకాలంగానే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారని వార్తలొస్తున్నాయి. డీజీపీ రాముడు సొంతూరు అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం నార్సింపల్లి. ఆయన సొంతూరు ఇప్పుడు ధర్మవరం నియోజకవర్గంలో ఉంది. రిటైర్ అయిన తర్వాత రాముడు రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయాలని […]

Advertisement
Update:2016-07-17 04:55 IST

డీజీపీ జేవీ రాముడు ఈ నెలాఖరుకు రిటైర్ అవుతున్నారు. ఆయన స్థానంలో ఆర్టీసీ ఎండీ నండూరి సాంబశివరావును నియమించేందుకు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అయితే రిటైర్ అయిన తర్వాత డీజీపీ జేవీరాముడు రాజకీయాల వైపు అడుగులేస్తారని చెబుతున్నారు. ఇందుకోసం చాలాకాలంగానే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారని వార్తలొస్తున్నాయి. డీజీపీ రాముడు సొంతూరు అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం నార్సింపల్లి. ఆయన సొంతూరు ఇప్పుడు ధర్మవరం నియోజకవర్గంలో ఉంది. రిటైర్ అయిన తర్వాత రాముడు రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఆయన జిల్లాకు వచ్చిన ప్రతిసారీ సొంతూరు, ఆ ప్రాంత ప్రజలతో కలిసి మంచిచెడులు అడిగి తెలుసుకుంటున్నారు. అంతా ఓకే అయితే వచ్చే ఎన్నికల్లో జేవీ రాముడు టీడీపీ తరపున ధర్మవరం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని చెబుతున్నారు.

ఈ నియోజకవర్గంలో టీడీపీ నుంచి గట్టి పోటీయే ఉంది. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే వరదాపురం సూరి కూడా టీడీపీకి చెందిన వ్యక్తే. అయితే వరదాపురం సూరిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని చంద్రబాబుకు రిపోర్టులు అందినట్టు చెబుతున్నారు. అంతేకాకుండా ధర్మవరం నుంచి తన కుమారుడిని బరిలో దింపేందుకు పరిటాల సునీత కూడా ప్రయత్నిస్తున్నారు. వరాపురం సూరి, పరిటాల సునీత, డీజీపీ రాముడు వీరు ముగ్గురు ఒకేసామాజికవర్గానికి చెందిన వారు కావడం విశేషం. జేవీ రాముడు రేసులో వస్తాడన్న వార్తలతో ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యే వరదాపురం సూరి ఆలోచనలో పడ్డారని చెబుతున్నారు. జేవీ రాముడు టికెట్ అడిగితే చంద్రబాబు కాదనే పరిస్థితి ఉండదని భావిస్తున్నారు. పైగా ధర్మవరం సిట్టింగ్‌ ఎమ్మెల్యే సూరి పనితీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉన్నట్టు చంద్రబాబుకు నివేదికలు కూడా వెళ్లాయి. కాబట్టి జేవీ రాముడు ఎంటరైతే ఆయనకు టికెట్ ఖాయమంటున్నారు. చూడాలి… జేవీ రాముడు రిటైర్ మెంట్‌ తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో?.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News