చంద్రబాబుకు బెజవాడ బెగ్గర్స్‌ సూటి ప్రశ్నలు

కృష్ణా పుష్కరాల సమయంలో విజయవాడలో ఏ ఒక్క అడుక్కు తినే వాడు కనిపించకూడదని చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సిటీలో బెగ్గర్స్‌ లేకుండా చేసే బాధ్యతను జిల్లా ఉన్నతాధికారులకు అప్పగించారు. 12 రోజులపాటు నగరం వదిలి వెళ్లేందుకు గాను ఒక్కొక్కరికి 5వేలు ఇస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే బెగ్గర్స్ ఇందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పుష్కరాలంటేనే పుణ్యం కోసం జనం వస్తుంటారని, కాబట్టి ఆ సమయంలో అడుక్కుంటే తమకు భారీగా డబ్బులు వస్తాయని చెబుతున్నారు. చంద్రబాబు […]

Advertisement
Update:2016-07-16 06:13 IST

కృష్ణా పుష్కరాల సమయంలో విజయవాడలో ఏ ఒక్క అడుక్కు తినే వాడు కనిపించకూడదని చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సిటీలో బెగ్గర్స్‌ లేకుండా చేసే బాధ్యతను జిల్లా ఉన్నతాధికారులకు అప్పగించారు. 12 రోజులపాటు నగరం వదిలి వెళ్లేందుకు గాను ఒక్కొక్కరికి 5వేలు ఇస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే బెగ్గర్స్ ఇందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పుష్కరాలంటేనే పుణ్యం కోసం జనం వస్తుంటారని, కాబట్టి ఆ సమయంలో అడుక్కుంటే తమకు భారీగా డబ్బులు వస్తాయని చెబుతున్నారు.

చంద్రబాబు ఇలా తమను నగరంలో ఉండ వద్దని చెప్పడం సరికాదంటున్నారు. ఆ మాటకొస్తే తామొక్కరిమేనా అడుక్కు తినేవారం అంటున్నారు. చంద్రబాబుకు కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు. రాజధానికి డబ్బులు లేవంటూ సచివాలయంలో హుండీలు పెట్టి అడుక్కోలేదా అని నిలదీస్తున్నారు. సచివాలయం అంటే గొప్పగొప్ప వాళ్లు వస్తుంటారని అలాంటి వారు తిరిగే చోటే హుండీలు పెట్టి అడుక్కోగా లేనిది తాము పుష్కరాల్లో అడుక్కుంటే తప్పా అని ప్రశ్నిస్తున్నారు. కనీసం ఒక్కొక్కరు ఒక్కో ఇటుక ఇవ్వండి అంటూ ఆన్‌లైన్‌లో ప్రభుత్వమే అడుక్కోవడం లేదా అని నిలదీస్తున్నారు. చివరకు స్కూల్‌ పిల్లలు చాక్లెట్ల కోసం తెచ్చుకున్న పది రూపాయలను కూడా అడుక్కుని తీసుకునే ప్రయత్నం చంద్రబాబు ప్రభుత్వం చేయలేదా అని నిలదీస్తున్నారు.

అవన్నీ తప్పు కానప్పుడు తమ వృత్తిని తాము పాటించడం తప్పుఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. అడుక్కోవడంలోనూ చంద్రబాబుకు ఒక నీతి, బిచ్చగాళ్లకు మరొక నీతి ఉంటుందా అని వారు ప్రశ్నిస్తున్నారు. గోదావరి పుష్కరాల సమయంలోనూ తమ వారిని ఇలాగే తరిమేశారని వాపోతున్నారు. హైదరాబాద్‌కు బిల్ క్లింటన్ వచ్చినప్పుడు కూడా బంధించి తీసుకెళ్లారని అంటున్నారు. అయితే అడుక్కోవడం తప్పే. బెగ్గింగ్‌ను ఎవరూ ప్రోత్సహించడం మంచిది కాదు. కానీ పీత కష్టాలు పీతవన్నట్టు… బెగ్గర్ల వాదన బెగ్గర్లది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News