వాడిని చంపేయండి...11ఏళ్ల బాలిక రోదన!
ఆమె పదకొండేళ్ల బాలిక…తండ్రి లేక, తల్లిచాటున బతుకుతున్న చిన్నపిల్ల…అలాంటి పిల్లని… ఒంటిమీద బట్టలు ఊడదీసి, చిత్రహింసలు పెట్టి, మానసికంగా, శారీరకంగా కోలుకోలేని గాయాలను చేసి వదిలిపెట్టాడు ఓ మృగాడు. ఇప్పుడు ఆ చిన్నారి ఆ దుర్మార్గుడిని చంపేయండి…అని అడుగుతోంది. ఆమె కోరిక ఎవరు తీర్చాలి…ఆమెకు ఎవరు సమాధానం చెప్పాలి. అసలు నేనెందుకు ఇవన్నీ ఎందుకు భరించాలి…అనే ప్రశ్నని ఆమె అడిగితే ఎవరు బాధ్యత వహించాలి….నన్ను ఇన్ని హింసలు పెట్టిన ఆ దుర్మార్గుడు ఎందుకు బతికుండాలి…అని అడుగుతున్న ఆమె […]
ఆమె పదకొండేళ్ల బాలిక…తండ్రి లేక, తల్లిచాటున బతుకుతున్న చిన్నపిల్ల…అలాంటి పిల్లని… ఒంటిమీద బట్టలు ఊడదీసి, చిత్రహింసలు పెట్టి, మానసికంగా, శారీరకంగా కోలుకోలేని గాయాలను చేసి వదిలిపెట్టాడు ఓ మృగాడు. ఇప్పుడు ఆ చిన్నారి ఆ దుర్మార్గుడిని చంపేయండి…అని అడుగుతోంది. ఆమె కోరిక ఎవరు తీర్చాలి…ఆమెకు ఎవరు సమాధానం చెప్పాలి. అసలు నేనెందుకు ఇవన్నీ ఎందుకు భరించాలి…అనే ప్రశ్నని ఆమె అడిగితే ఎవరు బాధ్యత వహించాలి….నన్ను ఇన్ని హింసలు పెట్టిన ఆ దుర్మార్గుడు ఎందుకు బతికుండాలి…అని అడుగుతున్న ఆమె ప్రశ్నకు ఎవరు, ఏమని జవాబు చెబుతారు?
అమాయకమైన చిన్నారులు మాయగాళ్ల వలలో చిక్కకుండా కన్నవాళ్లే ఆపలేకపోతున్నారు. ఓ తల్లి, మంచివాడే కదా అని నమ్మి తన పదకొండేళ్ల కూతురిని స్వయంగా ఒక మృగాడికి అప్పగించి మోసపోయింది. మహబూబ్ నగర్ జిల్లా గద్వాలకు చెందిన ఓ మహిళ యాక్సిడెంటులో భర్తను కోల్పోయి కర్నూలులో ఉన్న బంధువుల వద్దకు వచ్చింది. అదే ఊరిలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని, కూలిపని చేసుకుని తన ముగ్గురు పిల్లలను పోషించుకుంటోంది. పెద్దకూతురికి కొంచెం అంగవైకల్యం ఉంది.
తిరుపతిలో తనకు తెలిసిన వైద్యునికి చూపించి పాపకు బాగు చేయిస్తాను… తనతో పంపమంటూ…వరుసకు తమ్ముడయ్యే ఒక వ్యక్తి ఆమెను బలవంతపెట్టాడు. ఆ తల్లి ముందు నిరాకరించింది. అయితే ఆ వ్యక్తి తల్లి (ఈమెకు పిన్ని అవుతుంది) కూడా, తమ్ముడే కదా…పంపమంటూ ఒత్తిడి తెచ్చింది. దాంతో ఆమె నమ్మి పాపను అతనివెంట పంపింది.
ఆమెను తీసుకుని వెళ్లిన ఆ వ్యక్తి మొదట్లో కొన్ని రోజులు ఫోన్లో మాట్లాడించాడు. తరువాత అదీ మానేశాడు. చివరికి పదిహేను రోజుల తరువాత బాలికని ఆమె ఇంట్లో వదిలేసి వెళ్లిపోయాడు. బాలిక తీవ్రంగా భయపడుతూ ఉండటం, ఏడుస్తుండటం, ఒంటినిండా గాయలు ఉండటంతో ఆ మహిళ పాపను ఆసుపత్రికి తీసుకుని వెళ్లింది. ఆమెకి చికిత్స చేసిన డాక్టర్లు అత్యాచారం జరిగినట్టుగా గుర్తించడంతో ఏం జరిగిందని బాలికని అడిగారు. ఆమె బోరున విలపిస్తూ జరిగిన విషయాలన్నీ చెప్పింది.
బాలికని ఆ వ్యక్తి కర్నూలులోనే ఓ ఇంటిలో ఉంచినట్టుగా తెలుస్తోంది. తన ఒంటిమీద బట్టలను తీసేసి జాలిగంటె, పప్పు గుత్తితో చితకబాదేవాడని, చిత్రహింసలు పెట్టాడని, వాడిని చంపేయండి… అంటూ ఆ చిన్నారి ఆక్రోశించింది. పోలీసులు బాలికని, ఆమె తల్లిని ప్రశ్నించి వివరాలు సేకరిస్తున్నారు. నిందితుడు, ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడని, అతను గతంలోనూ పలు నేరాలకు పాల్పడ్డాడని పోలీసులు గుర్తించారు.