అంతేలేండి!... చినబాబుకు నేర్పాల్సింది అవే!

రాజకీయాల్లో ఎదగడానికి రకరకాల మార్గాలుంటాయి. కొందరు జనంలో తిరిగి సొంత గుర్తింపుతో ఎదుగుతుంటారు. మరికొందరు మరెవరో కష్టపడితే ఆ ఫలితాన్ని చాకచక్యంగా అందుకుని రాజ్యమేలుతుంటారు. రెండో మార్గంలో ఎదగాలంటే చాలా తెలివితేటలుండాలి. కన్నింగ్‌ మెంటాలిటీ పుష్కలంగా ఉండాలి. చంద్రబాబు ఎదిగిన తీరు కూడా అలాంటిదేనని ఆయన ప్రత్యర్థులు పదేపదే ఆరోపిస్తూ ఉంటారు. చంద్రబాబు సంగతి పక్కనపెడితే రాజకీయంగా ఎదిగేందుకు లోకేష్ ఎంచుకుంటున్న మార్గం కూడా ఆసక్తికరంగానే ఉంది. అన్ని కలిసి వస్తే ముఖ్యమంత్రి అయిపోవాలని లోకేష్ అనుకుంటున్నారు. […]

Advertisement
Update:2016-07-15 05:50 IST

రాజకీయాల్లో ఎదగడానికి రకరకాల మార్గాలుంటాయి. కొందరు జనంలో తిరిగి సొంత గుర్తింపుతో ఎదుగుతుంటారు. మరికొందరు మరెవరో కష్టపడితే ఆ ఫలితాన్ని చాకచక్యంగా అందుకుని రాజ్యమేలుతుంటారు. రెండో మార్గంలో ఎదగాలంటే చాలా తెలివితేటలుండాలి. కన్నింగ్‌ మెంటాలిటీ పుష్కలంగా ఉండాలి. చంద్రబాబు ఎదిగిన తీరు కూడా అలాంటిదేనని ఆయన ప్రత్యర్థులు పదేపదే ఆరోపిస్తూ ఉంటారు. చంద్రబాబు సంగతి పక్కనపెడితే రాజకీయంగా ఎదిగేందుకు లోకేష్ ఎంచుకుంటున్న మార్గం కూడా ఆసక్తికరంగానే ఉంది.

అన్ని కలిసి వస్తే ముఖ్యమంత్రి అయిపోవాలని లోకేష్ అనుకుంటున్నారు. ఆయన తండ్రి ఆశయం కూడా అదే. కానీ ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న లోకేష్ ఏపీ రాజకీయాల్లో ఉండకుండా ఢిల్లీ వెళ్లేందుకు మొగ్గు చూపడంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. సాధారణంగా జనబలంతో ఎదగాలనుకున్న నేతలు స్థానికంగా ఉంటూ జనంలో తిరగాల్సి ఉంటుంది. కానీ లోకేష్ అలాంటి రాజకీయాలను ఇష్టపడుతున్నట్టుగా కనిపించడం లేదు. చంద్రబాబు కూడా లోకేష్ను ఢిల్లీకి పంపేందుకు ఇష్టపడుతున్నారు. లోకేష్‌కు కొత్త విద్య నేర్పేందుకే ఈ ఏర్పాట్లని భావిస్తున్నారంటున్నారు.

ఇప్పటికే చంద్రబాబుపై భారీ అవినీతి ఆరోపణలు వచ్చాయి. కోర్టుల్లో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. అయితే ఏ రాజకీయ నాయకుడి విషయంలోనూ సాధ్యం కాని విధంగా ప్రతిసారి చంద్రబాబు స్టేలు తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం చంద్రబాబు విచ్చలవిడిగా అవినీతి చేస్తున్నారని సాక్ష్యాలు చూపిస్తున్నా… ఏ వ్యవస్థ కూడా ఆయన్ను నిరోధించలేకపోతోంది. ఓటుకు నోటు కేసులో ఆడియో, వీడియో టేపుల్లో దొరికినా చంద్రబాబును ఈ దేశంలో ఏ వ్యవస్థ కూడా ఏమీ చేయలేకపోయింది. దీనంతటికి కారణం చంద్రబాబు లాబీయింగ్‌ మహిమేనని చెబుతుంటారు.

ఢిల్లీ స్థాయిలో తనకున్న పరిచయాల సాయంతోనే కేసుల నుంచి చంద్రబాబు సమర్థవంతంగా తప్పించుకోగలుగుతున్నారు. ఎవరికి ఏం కావాలి?, వారిని ఎలా మచ్చిక చేసుకోవాలన్న స్కిల్స్‌ చంద్రబాబుకు తెలిసినంతగా మరెవరికీ తెలియదని చెబుతుంటారు. అందుకే ఇప్పుడు కుమారుడు లోకేష్‌కు కూడా ఢిల్లీ పరిచయాలు పెంచి, అక్కడి లాబీయింగ్ పాఠాలు నేర్పేందుకు ఆయన్ను చంద్రబాబు ఢిల్లీ పంపుతారని సమాచారం. ఢిల్లీలో వ్యవస్థలను శాసించే వ్యక్తులకు దగ్గరైతే ఇక భవిష్యత్తులో తన కుమారుడిని కూడా ఏ కేసులు, ఏ వ్యక్తులు అడ్డుకోలేవన్న భావనతో చంద్రబాబు ఉన్నారంటున్నారు. కాబట్టి ఢిల్లీ వ్యక్తులకు దగ్గరవడం, లాబీయింగ్ పాఠాలు నేర్చుకోవడం కోసమే లోకేష్ ఢిల్లీ వెళ్తున్నారని చెవులు కొరుక్కుంటున్నారు. కుమారుడి రక్షణ కోసం ఒక తండ్రి ఆ మాత్రం ఆలోచించడంలో తప్పులేదులేండి.

Click on Image to Read –

Tags:    
Advertisement

Similar News