నారా వారి స్రవంతి మాత్రం భేష్...

ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్ వ్యక్తుల ద్వారా భారీగా మద్యం ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వం జీవోలు విడుదల చేయడాన్ని వైసీపీ నేత అంబటిరాంబాబు తప్పుపట్టారు. ఎన్నికల ముందు ఎన్టీఆర్‌ సుజల స్రవంతి ద్వారా ఇంటింటికి రెండు రూపాయలకే 20 లీటర్ల నీరిస్తామన్న చంద్రబాబు దాన్ని మాత్రం పక్కన పెట్టేశారని  విమర్శించారు. మంచి నీళ్లు ఇస్తే కమిషన్లు రావని..  అదే మద్యం ఉత్పత్తికి లైసెన్స్‌లు ఇస్తే వందల కోట్లు కమిషన్లు వస్తాయన్న ఉద్దేశంతోనే చంద్రబాబు ఈ పని చేస్తున్నారని మండిపడ్డారు. లోకేష్‌కు […]

Advertisement
Update:2016-07-15 08:11 IST

ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్ వ్యక్తుల ద్వారా భారీగా మద్యం ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వం జీవోలు విడుదల చేయడాన్ని వైసీపీ నేత అంబటిరాంబాబు తప్పుపట్టారు. ఎన్నికల ముందు ఎన్టీఆర్‌ సుజల స్రవంతి ద్వారా ఇంటింటికి రెండు రూపాయలకే 20 లీటర్ల నీరిస్తామన్న చంద్రబాబు దాన్ని మాత్రం పక్కన పెట్టేశారని విమర్శించారు. మంచి నీళ్లు ఇస్తే కమిషన్లు రావని.. అదే మద్యం ఉత్పత్తికి లైసెన్స్‌లు ఇస్తే వందల కోట్లు కమిషన్లు వస్తాయన్న ఉద్దేశంతోనే చంద్రబాబు ఈ పని చేస్తున్నారని మండిపడ్డారు.

లోకేష్‌కు కమిషన్లు దోచిపెట్టేందుకు పేదల కాపురాలతో ఆడుకోవడం సరికాదన్నారు. నారాయణ కోసం ప్రభుత్వ బళ్లను, చైనా వాడి కోసం గుళ్లను కూల్చిన చంద్రబాబు ఇప్పుడు లోకేష్ కమిషన్‌ కోసం కాపులను కూల్చుతున్నారని ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్ సుజల స్రవంతిని గాలికి వదిలేసి… నారావారి సారా స్రవంతిని మాత్రం పక్కాగా అమలు చేస్తున్నారని అన్నారు. మద్యం కారణంగా ఆడపడుచులు నానా ఇబ్బందులు పడుతున్నారంటూ పాదయాత్రలో చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఒక్క బెల్ట్ షాపునైనా మూసివేశారా అని అంబటి ప్రశ్నించారు.

ఏపీని కాస్త అవినీతిప్రదేశ్‌గా మార్చేశారన్నారు. హైవేల పక్కన కూడా మద్యం షాపులకు అనుమతులు ఇచ్చి… టెట్రా ప్యాకెట్లను తెచ్చిన ఘనత కూడా చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు మారాలని పేదల జేబులుకొట్టే పనిని మానుకోవాలని అంబటి రాంబాబు సూచించారు.

Click on Image to Read –

Tags:    
Advertisement

Similar News