గోదావరి పుష్కరాలకు 30 మంది, కృష్ణా పుష్కరాలకు ...

కృష్ణా పుష్కరాల పేరుతో ప్రభుత్వం వందల కోట్ల దోపిడికి పాల్పడుతోందని వైసీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పార్థసారధి ఆరోపించారు. చంద్రబాబు అవినీతిని చూపి అధికారులు వణికిపోతున్నారని అన్నారు. పుష్కరాల పనుల్లో పరిపాలన అనుమతులు లేకుండానే కోట్ల రూపాయలు తమకు కావాల్సిన వారికి కట్టబెడుతున్నారని విమర్శించారు. నిబంధనలకు విరుద్ధమని అభ్యంతరం చెప్పిన అధికారులను స్వయంగా ముఖ్యమంత్రే బెదిరించడం ఏమిటని ప్రశ్నించారు. పుష్కరాల్లో అత్యంత ముఖ్యమైన విజయవాడ దుర్గఘాట్ పనులను కూడా ఇప్పటివరకు పూర్తి చేయలేదన్నారు. టెండర్లు లేకుండానే వందల […]

Advertisement
Update:2016-07-14 07:17 IST

కృష్ణా పుష్కరాల పేరుతో ప్రభుత్వం వందల కోట్ల దోపిడికి పాల్పడుతోందని వైసీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పార్థసారధి ఆరోపించారు. చంద్రబాబు అవినీతిని చూపి అధికారులు వణికిపోతున్నారని అన్నారు. పుష్కరాల పనుల్లో పరిపాలన అనుమతులు లేకుండానే కోట్ల రూపాయలు తమకు కావాల్సిన వారికి కట్టబెడుతున్నారని విమర్శించారు. నిబంధనలకు విరుద్ధమని అభ్యంతరం చెప్పిన అధికారులను స్వయంగా ముఖ్యమంత్రే బెదిరించడం ఏమిటని ప్రశ్నించారు. పుష్కరాల్లో అత్యంత ముఖ్యమైన విజయవాడ దుర్గఘాట్ పనులను కూడా ఇప్పటివరకు పూర్తి చేయలేదన్నారు. టెండర్లు లేకుండానే వందల కోట్లు దోచుకునేందుకు కావాలనే పనులు ఆలస్యం చేశారని ఆరోపించారు.

ఇప్పుడు సమయం లేదంటూ కోట్ల రూపాయల పనులను కావాల్సిన వారికి కట్టబెడుతున్నారని వివరించారు. పుష్కరాలను సాంప్రదాయాలకోసం కాకుండా దోపిడి కోసం నిర్వహిస్తున్నట్టుగా ఉందన్నారు. గోదావరి పుష్కరాల సమయంలో 30 మందిని చంపేశారని… ఇప్పుడు కృష్ణా పుష్కరాల సమయంలో 30 గుళ్లను కూల్చారని గుర్తు చేశారు. దీని బట్టే చంద్రబాబు వ్యవహారం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని పార్థసారథి అన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు ప్రకటనల కోసమే రూ. 75 కోట్లను జీవోల ద్వారా ఖర్చు చేశారని చెప్పారు.

ఒక వైపు తమది పేద రాష్ట్రం, కూర్చునేందుకు కూర్చీలు లేవు, పైన ఫ్యాన్లు లేవంటూనే పుష్కరాల్లో చేతి ఖర్చుల కోసం రూ. 50 కోట్లు విడుదల చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఆ 50 కోట్లు ఎలా ఖర్చు చేస్తారో కూడా చెప్పడం లేదని మండిపడ్డారు. గోదావరి జలాలను కృష్ణా నదిలోకి తీసుకొచ్చి పుష్కరాలు చేస్తామని చెప్పడంతో ప్రజల్లో అపోహలు నెలకొన్నాయని… వాటిని ప్రభుత్వం నివృత్తి చేయాలని పార్థసారథి డిమాండ్ చేశారు. గోదావరి పుష్కరాల్లో 30 మంది చనిపోయి సరిగ్గా నేటికి ఏడాది అయిందని ఇప్పటికీ ఏకసభ్య కమిటీ నివేదిక మాత్రం రాలేదని పార్థసారథి ఎద్దేవా చేశారు.

Click on Image to Read –

Tags:    
Advertisement

Similar News