సింగపూర్ లోనూ ఇలాగే ఎత్తుకెళ్తారా?... బాబు రాజీనామా చేయించు...

ఏపీలో ఆరోగ్యశాఖ పనితీరు పదేపదే వివాదాస్పదమవుతోంది. చంద్రబాబు నడియాడే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని ఆస్పత్రుల పనితీరు అధ్వాన్నంగా మారింది. కొద్ది రోజుల క్రితం గుంటూరులో ఎలుకలు చిన్నపిల్లాడిని ఆస్పత్రిలోనే కొరుక్కు తిని చంపేసిన ఘటన సంచలనం సృష్టించింది. ఇప్పుడు విజయవాడలోని ప్రభుత్వాస్పత్రిలో ఏకంగా చిన్నారి మాయమైపోయాడు. ఐసీయూలో ఉన్న వారం రోజుల బాబును మాయం చేసేశారు. కొత్తపేటకు చెందిన సుబ్రహ్మణ్యం, కల్యాణి దంపతులకు వారం క్రితం జన్మించిన బాబుకి కామెర్లు సోకటంతో విజయవాడ పాత ప్రభుత్వ ఆస్పత్రిలోని […]

Advertisement
Update:2016-07-14 11:52 IST

ఏపీలో ఆరోగ్యశాఖ పనితీరు పదేపదే వివాదాస్పదమవుతోంది. చంద్రబాబు నడియాడే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని ఆస్పత్రుల పనితీరు అధ్వాన్నంగా మారింది. కొద్ది రోజుల క్రితం గుంటూరులో ఎలుకలు చిన్నపిల్లాడిని ఆస్పత్రిలోనే కొరుక్కు తిని చంపేసిన ఘటన సంచలనం సృష్టించింది. ఇప్పుడు విజయవాడలోని ప్రభుత్వాస్పత్రిలో ఏకంగా చిన్నారి మాయమైపోయాడు. ఐసీయూలో ఉన్న వారం రోజుల బాబును మాయం చేసేశారు. కొత్తపేటకు చెందిన సుబ్రహ్మణ్యం, కల్యాణి దంపతులకు వారం క్రితం జన్మించిన బాబుకి కామెర్లు సోకటంతో విజయవాడ పాత ప్రభుత్వ ఆస్పత్రిలోని నవజాత శిశు చికిత్స కేంద్రంలో చేర్పించారు. చికిత్స పొందుతున్న శిశువును నాలుగు రోజులుగా ఇంక్యుబేటర్‌లో ఉంచారు.

గురువారం ఉదయం పాలు ఇచ్చి తిరిగి ఐసీయూలోని ఇంక్యుబేటర్‌లో ఉంచారు. లోనికి వచ్చిన నర్సులు బాబు తల్లి పాలు ఇస్తుండగా బయటకు వెళ్లిపోవాలని ఆదేశించారు. డాక్టర్లు వస్తున్నారని కాబట్టి బయటకు వెళ్లి కూర్చోవాలని ఆదేశించారు. దీంతో కల్యాణి బయటకు వచ్చేశారు. కాసేపటి తర్వాత లోనికి వెళ్లి చూస్తే పిల్లాడు కనిపించలేదు. దీనిపై నిలదీస్తే తమకేమీ తెలియదని వైద్యులు చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మహిళా సంఘాలు, ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆస్పత్రికి చేరుకుని ఆందోళనకు దిగారు. ఐసీయూలోకి తల్లిని కూడా అనుమతించడం లేదని… అలాంటప్పుడు మూడో వ్యక్తి ఎలా వచ్చి ఉంటారని ప్రశ్నిస్తున్నారు. సిబ్బందే బాబును మాయం చేశారని మహిళా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇక్కడ మరో విషయం ఏమిటంటే ఆస్పత్రిలో సీసీ కెమెరాలు పనిచేయడం లేదు.. చిన్నపిల్లలకు సంబంధించిన విభాగాల్లో తప్పనిసరిగా సీపీ కెమెరాలు ఉండాల్సి ఉన్నా ప్రభుత్వ ఆస్పత్రిలో మాత్రం అవి పనిచేయడం లేదు.. దీంతో వైద్య మంత్రి కామినేనిపై బాధితులు, ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

బాధితులను ఆస్పత్రిలో వైసీపీ నాయకుడు వంగవీటి రాధా, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, సీపీఎం నాయకుడు బాబూరావు పరామర్శించారు. బాధితుల ఆందోళనకు మద్దతు తెలిపారు. ఏపీని సింగపూర్‌లా చేస్తానంటున్న చంద్రబాబు… సింగపూర్‌ ఆస్పత్రుల్లో కూడా ఇలాగే పిల్లలు మాయమవుతారేమో చెప్పాలని రాధా ప్రశ్నించారు. చంద్రబాబు ఇంటికి వెళ్లే దారిలో మాత్రం అడుగడుగన సీసీ కెమెరాలు పెట్టుకున్న చంద్రబాబు… ఆస్పత్రుల్లో మాత్రం సీసీ కెమెరాలు అమర్చకపోవడం దారుణమన్నారు.

వెంటనే అసమర్థ మంత్రి కామినేని రాజీనామా చేయాలని రాధా, మల్లాది విష్ణు, బాబూరావు డిమాండ్ చేశారు. లేకుంటే ముఖ్యమంత్రే ఆరోగ్యశాఖ మంత్రిని తొలగించాలని డిమాండ్ చేశారు. కొద్ది రోజులుగా ఆస్పత్రిలో ఒక మహిళ అనుమానాస్పదంగా తిరుగుతోందని ఆమె బాబును ఎత్తుకెళ్లి ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో ఎత్తుకెళ్లిన వారిని కనిపెట్టడం సాధ్యం కావడం లేదు. అయినా కామినేని ఏం చేస్తారు?. బీజేపీ నుంచి చంద్రబాబుకు ఎలాంటి ఇబ్బంది రాకుండా కాపాడుకునే ప్రయత్నంలోనే ఆయన సమయం సరిపోతోంది.

Click on Image to Read –

Tags:    
Advertisement

Similar News