వైఎస్‌కు ఆర్‌.విద్యాసాగర్‌రావు ప్రశంసలు

వైఎస్‌ను తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, సాగునీటి రంగ నిపుణుడు ఆర్ . విద్యాసాగర్‌ రావు ప్రశంసించారు. వైఎస్ ఒక రాజనీతిజ్ఞుడని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఆయన ముందుచూపు ఆదర్శమన్నారు. వైఎస్‌ ప్రాజెక్టులు మొదలుపెట్టినప్పుడు తామంతా అభ్యంతరం చెప్పామని వెల్లడించారు. ‘‘వైఎస్‌ జలయజ్ఞం మొదలుపెట్టినప్పుడు సరిగ్గా ఇదే పరిస్థితి ఉంది. అప్పుడు మేం అభ్యంతరం చెప్పాం. ఎలాంటి అనుమతులు, నీటికేటాయింపులు లేకుండా 84 ప్రాజెక్టులు ఎలా కడుతారని ప్రశ్నించాం. పోలవరం వంటి ప్రాజెక్టుకు కనీసం స్థలానికి సంబంధించిన […]

Advertisement
Update:2016-07-14 02:30 IST

వైఎస్‌ను తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, సాగునీటి రంగ నిపుణుడు ఆర్ . విద్యాసాగర్‌ రావు ప్రశంసించారు. వైఎస్ ఒక రాజనీతిజ్ఞుడని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఆయన ముందుచూపు ఆదర్శమన్నారు. వైఎస్‌ ప్రాజెక్టులు మొదలుపెట్టినప్పుడు తామంతా అభ్యంతరం చెప్పామని వెల్లడించారు.

‘‘వైఎస్‌ జలయజ్ఞం మొదలుపెట్టినప్పుడు సరిగ్గా ఇదే పరిస్థితి ఉంది. అప్పుడు మేం అభ్యంతరం చెప్పాం. ఎలాంటి అనుమతులు, నీటికేటాయింపులు లేకుండా 84 ప్రాజెక్టులు ఎలా కడుతారని ప్రశ్నించాం. పోలవరం వంటి ప్రాజెక్టుకు కనీసం స్థలానికి సంబంధించిన అనుమతి కూడా లేదన్నాం” అని విద్యాసాగర్‌రావు చెప్పారు. కానీ వైఎస్ ఎంతో ముందుచూపుతో మాట్లాడారన్నారు. తనకు ప్రజలు ఐదేళ్లు అవకాశం ఇచ్చారని కాబట్టి ఈ ఐదేళ్లలో ప్రజల కోసం పని చేయాల్సిన అవసర‌ముందన్నారు.

ప్రాజెక్టులు ఈ రోజు ప్రారంభిస్తే ఐదేళ్లలో పూర్తికాకపోవచ్చు గానీ… ఏదో ఒకరోజు తప్పకుండా పూర్తవుతాయని వైఎస్ చెప్పారన్నారు. ప్రాజెక్టులకు కూడా అనుమతులు తెచ్చితీరుతామన్నారని గుర్తు చేశారు. ఆ రోజు మేం అభ్యంతరాలు చెప్పినా ఈరోజు వైఎస్‌ తీసుకున్న నిర్ణయమే కరెక్ట్‌ అన్న భావన తమకు కలుగుతోందన్నారు. వైఎస్‌ను స్ఫూర్తిగా తీసుకుని ప్రాజెక్టులు కట్టాల్సిన పరిస్థితి ఉందన్నారు. వైఎస్ రాజనీతిజ్ఞత కారణంగానే ఏపీలో ప్రాజెక్టులు కూడా పూర్తవుతున్నాయని విద్యాసాగర్‌ రావు అన్నారు.

కోదండరాం సాధారణ వ్యక్తి కాదని… తెలంగాణ ప్రజల ప్రతిబింబంలాంటి వారన్నారు. కాబట్టి కోదండరాం తొందరపడి ఏమీ మాట్లాడవద్దని విద్యాసాగర్‌రావు కోరారు. మల్లన్న సాగర్‌పై గందరగోళ పరిస్థితులు సృష్టించవద్దని కోరారు. పట్టిసీమకు అనుమతి వచ్చిన వెంటనే అందులో నాగార్జునసాగర్ పై ప్రాంతానికి వాటా రావాల్సి ఉందన్నారు.

Click on Image to Read –

Tags:    
Advertisement

Similar News