మా ఆఫీసు లాక్కున్నారు మొర్రో!
ఈ పొలికేకలు ఎవరివో కాదు.. తెలంగాణలో అంపశయ్య మీదున్న తెలుగుదేశం నేతలవి. ఇటీవల అసెంబ్లీలోని తమ కార్యాలయాన్ని స్పీకర్ స్వాధీనం చేసుకున్నారని గవర్నర్‌కు మొరపెట్టుకున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధమని నరసింహన్‌తో తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణ జరుగుతుండగానే.. తమ పార్టీ కార్యాలయాన్ని ఎలా ఖాళీ చేయిస్తారని ప్రశ్నించారు. దయచేసి ఈ విషయంలో కలుగజేసుకుని, తమకు న్యాయం చేయాలని ఆయనకు విన్నవించారు. అధికార పార్టీ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని గవర్నర్‌కు అందజేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 2014 […]
Advertisement
ఈ పొలికేకలు ఎవరివో కాదు.. తెలంగాణలో అంపశయ్య మీదున్న తెలుగుదేశం నేతలవి. ఇటీవల అసెంబ్లీలోని తమ కార్యాలయాన్ని స్పీకర్ స్వాధీనం చేసుకున్నారని గవర్నర్‌కు మొరపెట్టుకున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధమని నరసింహన్‌తో తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణ జరుగుతుండగానే.. తమ పార్టీ కార్యాలయాన్ని ఎలా ఖాళీ చేయిస్తారని ప్రశ్నించారు. దయచేసి ఈ విషయంలో కలుగజేసుకుని, తమకు న్యాయం చేయాలని ఆయనకు విన్నవించారు. అధికార పార్టీ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని గవర్నర్‌కు అందజేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
2014 ఎన్నికల్లో 15 మందితో కళకళలాడిన పార్టీ నేడు ముగ్గురితో వెలవెలబోతోంది. 12 మంది సైకిల్ పార్టీకి టాటా చెప్పి.. కారెక్కడంతో ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, ఆర్. కృష్ణయ్య మాత్రమే మిగిలారు. ఇటీవల ఫిరాయింపు ఎమ్మెల్యేలు అంతా తమ పార్టీ అసెంబ్లీ శాఖను టీఆర్ ఎస్‌లో విలీనం చేయడంతో మిగిలిన ముగ్గురి సభ్యులకు సాంకేతికంగా గుర్తింపు లేకుండా పోయింది. దీంతో వారి కార్యాలయాన్ని స్పీకర్ ఆదేశాల మేరకు ఇటీవల స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి టీడీపీ నేతలకు కార్యాలయం లేకుండా పోయింది. ఆగస్టులో అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అప్పుడు ఈ ముగ్గురు ఉండటానికి కార్యాలయం ఉండదు. దీంతో వారు బిక్కముఖం వేసుకుని మిగిలిన పార్టీల వైపు చూడాల్సి వస్తుంది. ఇది తమను అవమానించడానికే అధికార పార్టీ ఇలా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు.
గవర్నర్ నరసింహన్‌కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడంపై గులాబీనేతలు నవ్వుకుంటున్నారు. రాజ్యాంగ ప్రతినిధిగా ఆయన్ను ఏనాడూ గౌరవించని మీకు ఆయనకు వినతిపత్రం ఇచ్చే హక్కు ఎక్కడిది? అని ప్రశ్నిస్తున్నారు. ఏపీలో మీరు ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ.. ఇక్కడ వ్యతిరేకించడం బాబు రెండు కళ్ల సిద్దాంతానికి చక్కటి నిదర్శనమని ఎద్దేవా చేశారు. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్న చందంగా మునిగిపోయే పార్టీకి గొంతెక్కువగా ఉండటంలో వింతేమీ లేదని విమర్శిస్తున్నారు.
Advertisement