ఇంతకూ బాబు ర్యాంకు ఐదా? పదమూడా?...

ఇటీవల దేశంలోని ముఖ్యమంత్రుల పనితీరుపై ప్రధాని మోదీ ఒక అంతర్గత సర్వేనిర్వహించారు. సర్వే ఆధారంగా ముఖ్యమంత్రులకు ర్యాంకులు కేటాయించారు. ఈ ర్యాంకులపై మంగళవారం మీడియాలో కథనాలు వచ్చాయి.   చంద్రబాబుకు ఐదో ర్యాంకు వచ్చిందని… అయినప్పటికీ తనకు ఐదో స్థానం రావడంపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని కథనాలు వచ్చాయి. రాష్ట్రం కోసం తాను ఇంతగా కష్టపడుతుంటే మరీ ఐదో ర్యాంకు ఇస్తారా అని సన్నిహితుల దగ్గర వాపోయారని పత్రికలు రాశాయి. అయితే చంద్రబాబుకు లేటెస్ట్‌ రిపోర్ట్‌ […]

Advertisement
Update:2016-07-13 03:29 IST

ఇటీవల దేశంలోని ముఖ్యమంత్రుల పనితీరుపై ప్రధాని మోదీ ఒక అంతర్గత సర్వేనిర్వహించారు. సర్వే ఆధారంగా ముఖ్యమంత్రులకు ర్యాంకులు కేటాయించారు. ఈ ర్యాంకులపై మంగళవారం మీడియాలో కథనాలు వచ్చాయి. చంద్రబాబుకు ఐదో ర్యాంకు వచ్చిందని… అయినప్పటికీ తనకు ఐదో స్థానం రావడంపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని కథనాలు వచ్చాయి. రాష్ట్రం కోసం తాను ఇంతగా కష్టపడుతుంటే మరీ ఐదో ర్యాంకు ఇస్తారా అని సన్నిహితుల దగ్గర వాపోయారని పత్రికలు రాశాయి. అయితే చంద్రబాబుకు లేటెస్ట్‌ రిపోర్ట్‌ మరింత షాక్‌ ఇచ్చేలా ఉంది.

తనకు ఐదో ర్యాంకు వచ్చిందని చంద్రబాబు చెప్పుకోవడం చూసి … అసలు ర్యాంకును లీక్ చేశారు. ఇందులో చంద్రబాబు ర్యాంకు 13. టాప్‌ 5లో కాదు కదా టాప్ 10లో కూడా చంద్రబాబు లేరు. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు మాత్రం మోదీ ఫస్ట్ ర్యాంకు కట్టబెట్టారు. ఈ అంశాన్ని ప్రముఖ తెలుగు దిన పత్రిక ఆంధ్రభూమితో పాటు మరికొన్ని మీడియా సంస్థలు వెల్లడించాయి. శివరాజ్ సింగ్ చౌహాన్‌కు రెండవ ర్యాంకు వచ్చింది. రమణ్‌ సింగ్-3, ఆనంది బేన్‌-4, అరవింద్ కేజ్రివాల్‌కు 5వ ర్యాంకును మోదీ ఇచ్చారు. బీజేపీ, మీడియాలు బద్ధశత్రువుగా చూస్తున్నప్పటికీ కేజ్రివాల్ కు ఐదో ర్యాంకు ఇవ్వక తప్పినట్లు లేదు.

ముఖ్యమంత్రులపై ప్రజల్లో ఉన్న సంతృప్తిస్థాయి ఆధారంగా ప్రభుత్వ నిఘా వర్గాలతో పాటు, ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగానే ఈ ర్యాంకులను తయారు చేశారు. కేసీఆర్‌కు ఫస్ట్ ర్యాంకు ఇచ్చి తనకు ఏకంగా 13 వ ర్యాంకు ఇవ్వడం చంద్రబాబుకు షాకే. ఈ నెల 16న ర్యాంకులను ఆధికారికంగా ప్రకటిస్తారని చెబుతున్నారు. అయితే మిత్రపక్షంగా ఉన్న తనకు బలహీన ర్యాంకు ఇవ్వడం సరికాదన్న భావనలో చంద్రబాబు ఉన్నారు. ఎప్పటిలాగే ఢిల్లీ వెళ్లి మోదీతో వ్యక్తిగతంగా కలిసి ర్యాంకును సరి చేసుకునే అవకాశాలు కూడా కొట్టిపారేయలేమంటున్నారు.

Click on Image to Read –

Tags:    
Advertisement

Similar News