వైసీపీలోకి ఉండవల్లి, హర్షకుమార్ " ప్రముఖ పత్రిక కథనం
తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణకుమార్, హర్షకుమార్‌లు వైసీపీలో చేరుతున్నట్టు ఒక ప్రముఖ దినపత్రిక కథనం. త్వరలోనే వీరు వైసీపీలో చేరుతారని, పార్టీనాయకత్వం కూడా దీనిపై సీరియస్ గా దృష్టిపెట్టినట్టు పత్రిక చెబుతోంది. వీరిద్దరి చేరికను బలపరిచేలా వైసీపీ ఇటీవల చేసిన మార్పులను పత్రిక ప్రస్తావించింది. వైఎస్ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగిన 2004, 2009లో ఉండవల్లి, హర్షకుమార్ ఇద్దరూ కాంగ్రెస్ తరపున ఎంపీలుగా గెలిచారు. వైఎస్‌తో ఉండవల్లికున్న సాన్నిహిత్యం అందరికీ తెలిసిందే. కానీ కొన్ని […]
తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణకుమార్, హర్షకుమార్‌లు వైసీపీలో చేరుతున్నట్టు ఒక ప్రముఖ దినపత్రిక కథనం. త్వరలోనే వీరు వైసీపీలో చేరుతారని, పార్టీనాయకత్వం కూడా దీనిపై సీరియస్ గా దృష్టిపెట్టినట్టు పత్రిక చెబుతోంది. వీరిద్దరి చేరికను బలపరిచేలా వైసీపీ ఇటీవల చేసిన మార్పులను పత్రిక ప్రస్తావించింది. వైఎస్ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగిన 2004, 2009లో ఉండవల్లి, హర్షకుమార్ ఇద్దరూ కాంగ్రెస్ తరపున ఎంపీలుగా గెలిచారు. వైఎస్‌తో ఉండవల్లికున్న సాన్నిహిత్యం అందరికీ తెలిసిందే. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన జగన్ వెంట రాలేదు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే చంద్రబాబు పాలనపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన వైసీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నారని చెబుతున్నారు.
ఇక హర్షకుమార్ విషయానికి వస్తే ఆయన పార్టీలో చేరడానికి అంతా సిద్ధమైందని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన అమలాపురం నుంచి ఎంపీగా పోటీ చేస్తారని కథనం. మొన్నటి ఎన్నికల్లో అమలాపురం నుంచి వైసీపీ తరపున విశ్వరూప్ పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి విశ్వరూప్ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్ ఛార్జీగా వున్న విశ్వరూప్ ను ఇటీవల పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ గా నియమించారు. దీంతో హర్షకుమార్‌కు లైన్ క్లియర్ అయిందంటున్నారు. ఇక్కడ మరో విషయం ఏమిటంటే వైఎస్ ఉన్నప్పుడు ఆయనతో హర్షకుమార్ పెద్దగా సఖ్యతతో ఉండేవారు కాదు. కానీ జగన్ పార్టీ పెట్టిన తర్వాత ఒకసారి హర్షకుమార్ రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడగా… జగన్ స్వయంగా వెళ్లి ఆయనను పరామర్శించారు.
click on image to read-