బాబు టిష్యూ పేపర్లు వాడుకోవాల్సిన దుస్థితిలో ఉన్నారా?
చంద్రబాబు విదేశీ పర్యటనను వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తప్పుపట్టారు. ఫొటోలకు పోజులిస్తూ లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేస్తున్నాయంటూ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. పదేళ్ల కాలంలో దేశం మొత్తం మీద లక్షా 50 వేల కోట్ల పెట్టుబడులు వస్తే… చంద్రబాబు మాత్రం ఒక్క చైనా నుంచే ఏపీకి 50వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తజికిస్తాన్, కజికిస్తాన్ లాంటి దేశాలే పెట్టుబడుల కోసం ఎదురుచూస్తుంటే చంద్రబాబు మాత్రం అక్కడికి వెళ్లి పెట్టుబడుల కోసం […]
చంద్రబాబు విదేశీ పర్యటనను వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తప్పుపట్టారు. ఫొటోలకు పోజులిస్తూ లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేస్తున్నాయంటూ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. పదేళ్ల కాలంలో దేశం మొత్తం మీద లక్షా 50 వేల కోట్ల పెట్టుబడులు వస్తే… చంద్రబాబు మాత్రం ఒక్క చైనా నుంచే ఏపీకి 50వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తజికిస్తాన్, కజికిస్తాన్ లాంటి దేశాలే పెట్టుబడుల కోసం ఎదురుచూస్తుంటే చంద్రబాబు మాత్రం అక్కడికి వెళ్లి పెట్టుబడుల కోసం అడగడం ఆశ్చర్యంగా ఉందన్నారు. కజికిస్తాన్‌లో ఒక చిన్నహోటల్‌లో దిగి వారిచ్చే టిష్యూపేపర్ల మీద ప్లాన్లు గీసుకుంటూ సమావేశాలు నిర్వహిస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. అలాంటి దేశాలను పెట్టుబడులు పెట్టాలని అడుక్కోవడం ద్వారా చంద్రబాబు రాష్ట్రం పరువు తీస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు విదేశీ పర్యటనపై కేంద్రప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోనే జీవీకే, జీఎంఆర్, హెటిరో, రాంకో లాంటి దిగ్గజ సంస్థలు ఉండగా వాటిని పక్కన పెట్టి తెల్లతోలు, పిల్లి కళ్లు ఉంటేనే అవకాశం ఇస్తామన్నట్టుగా చంద్రబాబు ప్రవర్తించడం సరికాదన్నారు. చైనాలో బుల్లెట్ ట్రైన్ పక్కన నిలబడి అమరావతికి బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తోంది అంటున్న చంద్రబాబును ఏమనాలో అర్థం కావడం లేదన్నారు. అమరావతికి బుల్లెట్‌ను చంద్రబాబు ఎలా తీసుకొస్తారని ప్రశ్నించారు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం, రైల్వే శాఖ వంటివి ఉన్నాయన్న విషయం కూడా చంద్రబాబుకు గుర్తు లేదా అని ఎద్దేవా చేశారు. బందరు పోర్టుకు గతంలో రెండు వేల ఎకరాలు చాలన్న చంద్రబాబు ఇప్పుడు లక్ష ఎకరాలు తీసుకునేందుకు సిద్ధపడడం ఆక్షేపనీయమన్నారు. కేవలం తనకు కావాల్సిన వారికి భూములు కట్టబెట్టేందుకే చంద్రబాబు ఈ ప్రయత్నం చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు.
click on image to read-