ఆ రెండు చెడు అలవాట్లు...పిల్లలకు మేలు చేస్తాయి!
కొంతమంది పిల్లలకు నోట్లో వేలు వేసుకోవటం, గోళ్లు కొరకడం అలవాట్లు ఉంటాయి. అయితే చాలావరకు ఈ అలవాట్లను మానిపించాలని తల్లిదండ్రులు ప్రయత్నిస్తారు. డాక్టర్లు కూడా ఈ అలవాట్లు మంచివి కాదనే చెబుతారు. కానీ వీటి వలన పిల్లల్లో భవిష్యత్తులో ఎలర్జీలు వచ్చే అవకాశాలు తగ్గుతాయంటున్నారు పరిశోధకులు. ఈ రెండు అలవాట్లు ఉన్న పిల్లలు భవిష్యత్తులో డస్ట్, పిల్లులు, కుక్కలు, గుర్రాలు, ఫంగస్ లాంటి వాటివలన వచ్చే అలర్జీలకు గురికాకుండా ఉంటారట. బాల్యంలోనే మురికి, సూక్ష్మక్రిములను తట్టుకుని ఆరోగ్యంగా […]
కొంతమంది పిల్లలకు నోట్లో వేలు వేసుకోవటం, గోళ్లు కొరకడం అలవాట్లు ఉంటాయి. అయితే చాలావరకు ఈ అలవాట్లను మానిపించాలని తల్లిదండ్రులు ప్రయత్నిస్తారు. డాక్టర్లు కూడా ఈ అలవాట్లు మంచివి కాదనే చెబుతారు. కానీ వీటి వలన పిల్లల్లో భవిష్యత్తులో ఎలర్జీలు వచ్చే అవకాశాలు తగ్గుతాయంటున్నారు పరిశోధకులు.
ఈ రెండు అలవాట్లు ఉన్న పిల్లలు భవిష్యత్తులో డస్ట్, పిల్లులు, కుక్కలు, గుర్రాలు, ఫంగస్ లాంటి వాటివలన వచ్చే అలర్జీలకు గురికాకుండా ఉంటారట. బాల్యంలోనే మురికి, సూక్ష్మక్రిములను తట్టుకుని ఆరోగ్యంగా ఉన్నపిల్లలు పెద్దయిన తరువాత వ్యాధులకు దూరంగా ఉంటారనే సిద్ధాంతం దీనికి కూడా వర్తిస్తుందని కెనడాలోని మెక్ మాస్టర్ యూనివర్శిటీ పరిశోధకుడు మాల్కామ్ సియర్స్ తెలిపారు.
అయితే పిల్లలకు ఈ రెండు అలవాట్లను చేయమని తాము చెప్పటం లేదని, కేవలం ఈ అలవాట్లను మానిపించలేక బాధపడుతున్నవారికి చింతించవద్దని చెప్పడమే తమ ఉద్దేశ్యమని పరిశోధకులు అంటున్నారు. వేలు చీకటం, గోళ్లు కొరకటం కారణంగా తమకు చేరిన బ్యాక్టీరియాని తట్టుకోవటం పిల్లలకు అలవాటు కావటం వల్ల రోగనిరోధక శక్తి పెరగటంగా దీన్ని భావించవచ్చు.