నాయుడినే పత్రాలు అడుగుతార్రా?
ఏమి చేసినా చంద్రబాబు వెనుకేసుకొస్తుండడంతో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. పోలీసులనే జయించే పనిలో ఉన్నారు. చింతమనేని రెగ్యులర్‌గా పోలీసులపై చిందులు వేస్తూనే ఉండగా… ఆ మధ్య విజయవాడలో ఒక టీడీపీ కార్పొరేటర్ ఒక కానిస్టేబుల్‌ను నడిరోడ్డుపైనే కాలితో తన్నేశారు. కొద్ది రోజుల క్రితమే జగన్ దిష్టిబొమ్మను కాల్చే ప్రయత్నంలో విజయవాడ టీడీపీ నేత ఒకరు గాయపడ్డారు. ఆయనను రక్షించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలోనే టీడీపీ కార్యకర్తలు ఎస్‌ఐ టోపీనే లాగి పడేశారు. ఆ మధ్య చిత్తూరు జిల్లాలోనూ నడిరోడ్డుపైనే […]
ఏమి చేసినా చంద్రబాబు వెనుకేసుకొస్తుండడంతో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. పోలీసులనే జయించే పనిలో ఉన్నారు. చింతమనేని రెగ్యులర్‌గా పోలీసులపై చిందులు వేస్తూనే ఉండగా… ఆ మధ్య విజయవాడలో ఒక టీడీపీ కార్పొరేటర్ ఒక కానిస్టేబుల్‌ను నడిరోడ్డుపైనే కాలితో తన్నేశారు. కొద్ది రోజుల క్రితమే జగన్ దిష్టిబొమ్మను కాల్చే ప్రయత్నంలో విజయవాడ టీడీపీ నేత ఒకరు గాయపడ్డారు. ఆయనను రక్షించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలోనే టీడీపీ కార్యకర్తలు ఎస్‌ఐ టోపీనే లాగి పడేశారు.
ఆ మధ్య చిత్తూరు జిల్లాలోనూ నడిరోడ్డుపైనే పోలీసులను తెలుగు తమ్ముళ్లు ఉరికించి కొట్టారు. ఇప్పుడు లేటెస్ట్‌గా… చంద్రబాబు సొంత జిల్లాలోనే టీడీపీ నేత ఒకరు వీరంగం సృష్టించారు. చిత్తూరులో టీడీపీ నేత మనోహర్ నాయుడి కారును పోలీసులు ఆపారు. వాహనపత్రాలు చూపించాల్సిందిగా కోరారు. అంతే మనోహర్‌నాయుడికి కోపం కట్టలు తెంచుకుంది. నేను టీడీపీ నేత మనోహర్‌నాయుడిని. నన్నే కారు ఆపి పత్రాలు అడుగుతారా అంటూ ఓ రేంజ్లో రెచ్చిపోయారు. నడిరోడ్డుపైన నానా రభసా చేశారు. అంతేనా కారును నడిరోడ్డు మీదే వదిలేసి మీ ఇష్టమొచ్చింది చేసుకోండి అంటూ వెళ్లిపోయారు. కారు నడిరోడ్డుపై ఉంచి వెళ్లిపోవడంతో ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయింది. దీంతో పోలీసులకు చెమటలు పట్టాయి. అయితే రచ్చ చేసిన నాయుడు టీడీపీ వ్యక్తి కావడంతో పోలీసులు కూడా సరే అనుకున్నారు.
click on image to read-