వెంటాడుతున్న స్మృతి
రోహిత్ మరణించి కూడా పాలకుల్ని వెంటాడుతున్నాడు. బహిష్కరణకు వ్యతిరేకంగా ధిక్కరించి కుల వివక్షపై ఉద్యమించిన రోహిత్ మరణించిన తర్వాత ఆ ఉద్యమానికి ఓ స్ఫూర్తిగా నిలిచాడు. ఆయన స్ఫూర్తితో ఇప్పటికీ విద్యార్థలు ఉద్యమిస్తూనే ఉన్నారు. ఎలాగైనా ఈ ఉద్యమాన్ని నీరుగార్చాలని చూస్తున్న కొందరు గుట్టుగా రోహిత్ వేముల విగ్రహాన్ని మాయం చేసేందుకు ఆదివారం తెల్లవారుజామున ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో విఫలమైన దుండుగులు రోహిత్ విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు. క్యాంపస్‌లో గతంలో అపహరించిన అంబేద్కర్ విగ్రహం ఆచూకీ […]
Advertisement
రోహిత్ మరణించి కూడా పాలకుల్ని వెంటాడుతున్నాడు. బహిష్కరణకు వ్యతిరేకంగా ధిక్కరించి కుల వివక్షపై ఉద్యమించిన రోహిత్ మరణించిన తర్వాత ఆ ఉద్యమానికి ఓ స్ఫూర్తిగా నిలిచాడు. ఆయన స్ఫూర్తితో ఇప్పటికీ విద్యార్థలు ఉద్యమిస్తూనే ఉన్నారు. ఎలాగైనా ఈ ఉద్యమాన్ని నీరుగార్చాలని చూస్తున్న కొందరు గుట్టుగా రోహిత్ వేముల విగ్రహాన్ని మాయం చేసేందుకు ఆదివారం తెల్లవారుజామున ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో విఫలమైన దుండుగులు రోహిత్ విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు. క్యాంపస్‌లో గతంలో అపహరించిన అంబేద్కర్ విగ్రహం ఆచూకీ తేలకముందే మరో ఘటనతో వెనుకబడిన కులాలకు చెందిన విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశ్వవిద్యాలయ పాలక వర్గం, దేశ పాలకులను ప్రశ్నించి, పోరాడి, మరణంతో నిరసన ప్రకటించిన రోహిత్ వేముల చచ్చి కూడా పాలకుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు. దళిత విద్యార్థుల ఐక్యత, ప్రగతిశీల శక్తుల ప్రతిఘటనతో తలబొప్పికట్టిన విశ్వవిద్యాలయ పాలకులు అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకోకుండా ఇంకా పాత పంథానే అనుసరిస్తూ విశ్వవిద్యాలయంలో అలజడికి ఆజ్యం పోస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. రోహిత్ వేముల మరణానికి కారణమైన కేంద్ర మంత్రులు, ఎంఎల్‌సీ, వీసీలను అరెస్ట్ చేయాలని విద్యార్థి ఉద్యమం కొనసాగుతుండగా ఈ ఘటన అగ్నికి ఆజ్యం పోసినట్లైంది.
Advertisement